Food Combinations: తప్పుడు ఫుడ్ కాంబినేషన్లతో జాగ్రత్త.. వీటిని కలిపి తింటే..!!

రోజువారీగా తీసుకునే అనేక ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోంది. ఇది కేవలం గ్యాస్, అసిడిటీ వంటి సాధారణ సమస్యలకు మాత్రమే పరిమితం కాకుండా.. దీర్ఘకాలంలో స్థూలకాయం, రక్తహీనత, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తుంది.

New Update
Food Combination

Food Combination

Food Combination: నేటి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నా సరే.. కొన్నిసార్లు ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం మనం తీసుకునే ఫుడ్ కాంబినేషన్లే. మనం రోజువారీగా తీసుకునే అనేక ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోంది. ఇది కేవలం గ్యాస్, అసిడిటీ వంటి సాధారణ సమస్యలకు మాత్రమే పరిమితం కాకుండా.. దీర్ఘకాలంలో స్థూలకాయం, రక్తహీనత, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తుంది. సోషల్ మీడియాలో చూసే కొత్త ట్రెండ్స్ కారణంగా చాలామంది తప్పుడు ఆహారపు అలవాట్లకు బానిసలవుతున్నారు. వాటిలో కొన్నింటిని నివారించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ విషయాలపై కొన్ని ఈ  ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

తప్పుడు ఫుడ్ కాంబినేషన్లు:

పెరుగు-నెయ్యి: ఈ రెండూ ఆరోగ్యకరమైనవే అయినా.. కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. బరువు తగ్గడం కష్టం అవుతుంది.

పాలు-ఉప్పు: పాలు తాగిన వెంటనే ఉప్పగా ఉండే ఆహారాలు తినడం వల్ల శరీరంలో విష పదార్థాలు పెరిగి చర్మ సమస్యలకు దారితీస్తుంది.

టమాటా-దోసకాయ: సలాడ్‌లో ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట వస్తాయి.

బ్రెడ్-జామ్: ఇది షుగర్ లెవల్స్ పెంచి, బరువు పెరగడానికి, మధుమేహం రావడానికి కారణం కావచ్చు.

పాలు-పుల్లని పండ్లు: పాలు, నిమ్మ లేదా ఇతర పుల్లని పండ్లను కలిపి తీసుకుంటే.. పాలు విరిగిపోయి జీర్ణం అవ్వడం కష్టమవుతుంది.

వేరుశనగ-నీళ్లు: వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే దగ్గు, శ్వాస సమస్యలు వస్తయని నిపుణులు చెబుతున్నారు.

పాలకూర-టీ: పాలకూరలో ఉండే ఐరన్‌ని, టీలో ఉండే కెఫీన్ శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది.

ఇది కూడా చదవండి: కళ్ళకు దోసకాయతో రిలాక్స్.. నల్లటి వలయాలతోపాటు వాపు నుంచి ఉపశమనం

ఆహారం తీసుకునేటప్పుడు కాంబినేషన్ల గురించి ఆలోచించి.. సోషల్ మీడియాలో ట్రెండ్స్‌ని గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్త పడాలి. సరైన సమయానికి.. సరైన ఆహారాన్ని తీసుకుని.. భోజనం తర్వాత వెంటనే నీళ్లు, పండ్లు, పాలు తాగకుండా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణుల చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన ఫుడ్ కాంబినేషన్లు:  

కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల వాటి పోషక విలువలు రెట్టింపు అవుతాయి. ఉదాహరణకు.. సి-విటమిన్ అధికంగా ఉండే నిమ్మరసాన్ని ఐరన్ ఉన్న పాలకూర, కాయధాన్యాలతో కలిపి తీసుకుంటే.. శరీరం ఐరన్‌ను సులభంగా గ్రహిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన అవకాడోను టమాటా లేదా క్యారెట్‌తో కలిపి తింటే.. విటమిన్‌లు బాగా శోషించుకోబడతాయి. అలాగే పసుపులో ఉండే కుర్కుమిన్, నల్ల మిరియాలలో ఉండే పెప్పెరిన్ కలిపి తీసుకుంటే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పెరుగుతాయి. ఇటువంటి మంచి కాంబినేషన్లు ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వేడి నీటిని తాగేవారికి అలర్ట్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Advertisment
తాజా కథనాలు