/rtv/media/media_files/2025/08/08/coffee-side-effect-2025-08-08-07-13-42.jpg)
Coffee Side Effect
Coffee Side Effect: నేటికాలంలో ఉదయం లేచిన వెంటనే వేడి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ గింజలను కాల్చి, వాటితో తయారు చేసే ఈ పానీయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. కాఫీలో ఉండే కెఫిన్ అనే రసాయనం మెదడును ఉత్తేజపరుస్తుంది, అలసటను తగ్గిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. అయితే.. దీనిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కాఫీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. అది ఒక సంస్కృతి, ఒక అలవాటు. అతిగా కాఫీ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయట. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ఎప్పుడైనా.. ముఖ్యంగా ఉదయం పూట చురుకుగా ఉండడానికి, అలసటను దూరం చేసుకోవడానికి చాలామంది కాఫీ తాగుతుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ అభిప్రాయం ప్రకారం.. రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగడం వల్ల నిద్ర, జీర్ణక్రియపై ప్రభావం పడటమే కాకుండా గుండె, మెదడు, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
ఎక్కువ కాఫీ తాగితే కలిగే అనర్థాలు:
నిద్రలేమి సమస్యలు: కాఫీలో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల రాత్రిపూట నిద్రపట్టకపోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కాఫీ తాగడం వల్ల నిద్ర నాణ్యత తగ్గిపోతుంది.
గుండె వేగం పెరగడం: ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల గుండె వేగం పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం.
అసిడిటీ- జీర్ణ సమస్యలు: ఖాళీ కడుపుతో కాఫీ తాగితే పొట్టలో గ్యాస్ట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పొట్టలో మంట, అల్సర్ వంటి సమస్యలు రావచ్చు.
మానసిక ఒత్తిడి: కెఫిన్ మెదడును ఎక్కువగా ఉత్తేజపరచడం వల్ల ఆందోళన, చిరాకు, మానసిక ఒత్తిడి వంటివి పెరుగుతాయి. దీన్ని చాలామంది శక్తిగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి ఇది మెదడులోని అలసటను కప్పి ఉంచుతుంది.
ఇది కూడా చదవండి: కళ్ళకు దోసకాయతో రిలాక్స్.. నల్లటి వలయాలతోపాటు వాపు నుంచి ఉపశమనం
కాఫీ తాగేవారికి సూచనలు:
వైద్యుల సలహా ప్రకారం.. కాఫీ అలవాటును పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. కానీ రోజుకు ఒక కప్పు మించి తీసుకోకుండా జాగ్రత్త పడాలి. సాయంత్రం తర్వాత కాఫీ తాగకుండా ఉండడం మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య జీవనశైలి, ఆహారపు అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం. అతిగా ఏది తీసుకున్న ఆరోగ్యానికి నష్టమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: తప్పుడు ఫుడ్ కాంబినేషన్లతో జాగ్రత్త.. అనారోగ్య సమస్యలకు ఆహ్వానించినట్లే..!!