/rtv/media/media_files/2025/05/04/lppndqg4pXYIXLS9sDhg.jpg)
high temperatures
High Temperatures: వేసవిలో పురుషులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు అత్యంత సర్వ సాధారణమైనవే అయినా వాటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలుగా మారే అవకాశం ఉంది. ఎక్కువ చెమట, తేమ, వేడి కారణంగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. ఇది అలసట, తలనొప్పి, కండరాల బలహీనతకు దారి తీస్తుంది. అలాగే ఎక్కువగా చెమట పట్టే పురుషులు వేడి దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్, చెమట దుర్వాసన సమస్యలను అనుభవించవచ్చు, ముఖ్యంగా మడమలు, చంకలు, కాళ్లు వంటి భాగాల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది.
ఆరోగ్యంగా గడిపేందుకు..
తీవ్ర ఎండకు గురవడం వల్ల సన్‌బర్న్, టానింగ్, UV కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని నలుపుగా చేయడమే కాకుండా పొడిబారిపోయేలా చేస్తుంది. కొంత మందికి ఎర్రగా మారి బొబ్బలు కూడా రావచ్చు. దీర్ఘకాలంగా సూర్యరశ్మి ప్రభావంలో ఉండడం వల్ల చర్మ క్యాన్సర్‌కు అవకాశం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 104°F కంటే ఎక్కువగా పెరిగితే స్పష్టత కోల్పోవడం, జ్వరం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వేసవి కాలాన్ని ఆరోగ్యంగా గడిపేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: పెదవులు తరచుగా ఎండిపోతుంటే ఈ లోపం ఉన్నట్టే
రోజుకు కనీసం 10 గ్లాసులపైగా నీరు తాగాలి. కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి సహజ ద్రావణాలు ఉపయోగపడతాయి. గాలి ఆడేలా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవడం ద్వారా చర్మాన్ని రక్షించవచ్చు. సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం ద్వారా UV ప్రభావం తగ్గుతుంది. జీర్ణానికి తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా పండ్లు, సలాడ్లు, నీరు అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం, ప్రత్యేకించి చెమట పట్టే భాగాలను శుభ్రంగా ఉంచడం వల్ల ఫంగస్ సమస్యలు నివారించవచ్చు.
ఇది కూడా చూడండి: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ 3 విత్తనాలను పెరుగుతో కలిపి తింటే కీళ్ల నొప్పులు ఉండవు
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | man )