HIT 3 BOX Office Collections: నేచురల్ స్టార్ నాని- శైలేష్ కొలను కాంబోలో విడుదలైన లేటెస్ట్ మూవీ 'హిట్ 3'. మే 1న విడుదలైం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించగా.. రెండవ రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రెండు రోజుల్లోనే ఈజీగా 50 కోట్ల మార్క్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 62 కోట్ల వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద అర్జున్ సర్కార్ వేట కొనసాగుతుంది.. అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.
త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్..
3వ రోజు(శనివారం) కూడా డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసింది. సక్నిల్క్ నివేదిక ప్రకారం 3వ రోజు ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో రూ. 10. 25 కోట్ల వసూళ్లు సాధించింది. దీని ప్రకారం మూడు రోజుల్లో రూ. 70 కోట్లకు పై వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగితే వారంతోలోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు.
శని, ఆదివారాలు వీకెండ్స్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
May this just be the beginning. Go catch the action on the big screen if you haven’t yet. It will be worth your time. pic.twitter.com/Id2VaXD6s6
— Sailesh Kolanu (@KolanuSailesh) May 2, 2025
మరోవైపు బుక్ మై షోలో కూడా ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఫస్ట్ డే రోజు 2.70 లక్షల టికెట్లు అమ్ముడవగా, రెండో రోజు 2.06 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని బుక్ మై షో తెలిపింది. అన్ని థియేటర్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీ తో అర్జున్ సర్కార్ జోరు కొనసాగుతోంది.
hit-3-movie | latest-news | telugu-news | cinema-news