/rtv/media/media_files/2025/05/04/qrW487ju4Zkn7ATtBeWU.jpg)
Lips Dry
Dry Lips Causes: పెదవులు పొడిబారడం అనేది ఒక సాధారణమైన సమస్య. కానీ తరచుగా అలా జరిగితే శరీరంలో కొన్ని లోపాలు ఉన్నట్టే. పలు కారణాల వల్ల పెదవులు పొడిబారవచ్చు. వాటిలో ముఖ్యమైనవి శరీరంలోని పోషకాలు, నీటి కొరత. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా పెదవులు ఎండిపోవడానికి కారణమవుతాయి. శరీరంలో నీటి కొరత పెదవులపై చూపిస్తుంది. నీటి స్థాయిలు తగ్గినప్పుడు పెదవులు ముందుగా ప్రభావితం అవుతాయి. ఈ పరిస్థితిలో పెదవులు ఎండిపోతాయి. వాటిలో పగుళ్లు ఏర్పడతాయి. ఇది ఎక్కువగా డీహైడ్రేషన్ వల్ల జరుగుతుంటుంది.
ఇది కూడా చదవండి: ఉదయం పరగడుపున వీటిని తింటే ఎంతో ఆరోగ్యం
నాలుక, చర్మంపై ప్రభావం..
ముదురు రంగులో మూత్రం, అలసట అనేవి నీటి కొరతకు సంకేతాలు. విటమిన్ B2 లోపం కూడా పెదవులు పొడిబారడానికి ప్రధాన కారణం కావచ్చు. విటమిన్ B2 లేదా రైబోఫ్లేవిన్ కణాల ఆరోగ్యానికి అవసరమైన పోషకం. దీని లోపం పెదవుల మూలల్లో పగుళ్లు, వాపు వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితి నాలుక, చర్మంపై ప్రభావం చూపుతుంది. ఇంకా ఐరన్ లోపం కూడా పెదవులు పొడిబారానికి కారణమవుతుంది. ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. దీని పం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో పెదవులు ఎండిపోతాయి. ఈ సమస్యకు అలసట, బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: తూర్పు గోదావరి జిల్లాలో దారుణ హ*త్య
జింక్ లోపం కూడా పెదవుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జింక్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జింక్ లోపం వల్ల పెదవులు పగుళ్లు ఏర్పడటంతో పాటు గాయాలు మానటానికి ఆలస్యం అవుతుంది. అలెర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా పెదవుల పొడిబారడానికి కారణమవుతాయి. టూత్‌పేస్ట్, లిప్ బామ్ వంటి ఉత్పత్తులకు అలెర్జీ వల్ల పెదవులపై ఎరుపు, మంట, దురద రావచ్చు. అలాగే ఫంగస్ ఇన్ఫెక్షన్లు కూడా పెదవులను పొడిబారేలా చేస్తాయి. ఈ సమస్యలను అధిగమించడానికి ఆహారం, జీవనశైలిలో మార్పులు అవసరం. పెదవులు పొడిబారకుండా ఉండేందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చికెన్ తింటే నిజంగానే క్యాన్సర్ వస్తుందా..నిపుణులు ఏమంటున్నారు?
ఇది కూడా చదవండి: ఉదయాన్నే చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ప్రయోజనాలు
( black-lips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)