/rtv/media/media_files/2025/10/04/breakfast-2025-10-04-16-35-19.jpg)
Breakfast
నేటి కాలంలో బరువు తగ్గాలని ప్రయత్నించేవారికైనా.. సాధారణ ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికైనా ఉదయం తీసుకునే అల్పాహారం అత్యంత కీలకం. బ్రేక్‌ఫాస్ట్ రోజును శక్తితో ఉల్లాసంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. ఇది కేవలం శక్తి స్థాయిలనే కాక.. మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. కడుపు నిండుగా, పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోవడం వల్ల రోజు మొత్తం కేలరీల వినియోగాన్ని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఆరోగ్యకరమైన భోజనం చేయడం ద్వారా ఆకలిని నియంత్రించే హార్మోన్లు (Appetite-regulating hormones) సక్రమంగా పనిచేసి మధ్యాహ్నం వరకు ఆకలి బాధ తగ్గిస్తుంది. అంతేకాకుండా అనవసరమైన ఆహార పదార్థాలపై కోరికను తగ్గుతుంది. సమతుల్య అల్పాహారంలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy Fats), ఫైబర్ (Fiber) ఉండాలి. ఇవి రోజంతా దృష్టి సారించి.. శక్తితో పనిచేయడానికి తోడ్పడతాయి. అల్పాహారంగా ఏమి తినాలా అని ఆలోచిస్తున్నారా..? కొన్ని ఆరోగ్యకరమైన.. కడుపు నింపే అద్భుతమైన అల్పాహారాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఆరోగ్యం కోసం అద్భుతమైన అల్పాహారం:
వెజిటబుల్ ఉప్మా: గోధుమ రవ్వతో కూరగాయలు కలిపి చేసే ఉప్మాలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇడ్లీ-సాంబార్: పెరుగుతో చేసిన ఇడ్లీ, ప్రొటీన్ అధికంగా ఉండే సాంబార్ అద్భుతమైన కలయిక.
గుడ్లు (Eggs): ఉడికించినా, ఆమ్లెట్‌గా చేసుకున్నా... గుడ్లు అధిక ప్రొటీన్‌కు మూలం. వీటిని బ్రెడ్ లేదా వెజిటబుల్ ర్యాప్‌తో తీసుకోవచ్చు.
ఓట్‌మీల్: ఫైబర్ అధికంగా ఉండే ఓట్‌మీల్ చాలాసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇందులో పండ్లు, గింజలు చేర్చుకుంటే మరింత ఆరోగ్యకరం.
ఇది కూడా చదవండి: మళ్లీ స్టార్ట్.. హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. ఆ ఏరియాల్లో హైలర్ట్!
పీనట్ బటర్ విత్ పనీర్: పీనట్ బటర్ ప్రొటీన్‌తో సమృద్ధిగా ఉంటుంది. దీనికి పనీర్, తరిగిన కూరగాయలు కలిపితే సంపూర్ణ అల్పాహారం.
గ్రీక్ యోగర్ట్ పర్‌ఫైట్: గ్రీక్ యోగర్ట్‌ను తాజా పండ్లు, గ్రానోలా లేదా గింజలతో కలిపి తీసుకుంటే ప్రొటీన్, విటమిన్లు లభిస్తాయి.
స్మూతీ (Smoothie): అరటిపండు, ఆపిల్, పాలకూర వంటి మీకు ఇష్టమైన పండ్లు, కూరగాయలను కలిపి స్మూతీ తయారు చేసుకోవచ్చు.
నట్ బటర్: బ్రెడ్, ఆపిల్స్ లేదా అరటిపండ్లపై నట్ బటర్ రాసుకుని తినడం లేదా స్మూతీలో కలుపుకోవడం మంచిది. ఈ ఎంపికలతో రోజును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ప్రారంభిచవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పసుపు, కారం, ఫుడ్ ఐటెమ్స్ నకిలీవా? కాదా..?.. ఈ సింపుల్ చిట్కాతో తెలుసుకోండి..!!