/rtv/media/media_files/2025/10/04/turmeric-and-chili-food-2025-10-04-13-20-11.jpg)
Turmeric and chili food
ఈ రోజుల్లో మార్కెట్‌లో లభించే ఆహార పదార్థాల(food-items) నాణ్యత, స్వచ్ఛత గురించి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పండుగల వేళల్లో స్వీట్స్‌లో కల్తీ సర్వసాధారణం కాగా.. ఇప్పుడు మసాలా దినుసుల (Spices)లో కూడా కల్తీ జరుగుతోంది. రంగు కోసం హానికరమైన రసాయనాలు.. పరిమాణం పెంచడానికి ఇతర పదార్థాలను కలపడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతోంది. అయితే పసుపు, కారం, జీలకర్ర, ఇంగువ వంటి మసాలా దినుసులలో స్వచ్ఛతను గుర్తించడానికి కొన్ని సులభమైన గృహ చిట్కాలను (Home Hacks) ఉన్నాయి. మసాలా దినుసులు కల్తీవని ఇంట్లోనే సులభంగా ఎలా తెలుసుకోవాలో వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కల్తీ వాటిని గుర్తించే చిట్కాలు:
ఇది కూడా చదవండి: ప్రోటీన్ స్మూతీతో 5 నిమిషాల్లో శరీరానికి కావలసిన శక్తి
- కారం, పసుపు పొడి (Chilli and Turmeric Powder):ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ కారం లేదా పసుపు పొడి వేయాలి. అసలు కారం లేదా పసుపు నెమ్మదిగా మునిగి తేలికపాటి రంగును ఇస్తుంది. కల్తీ పొడి త్వరగా అడుగుకు చేరి.. నీటిని నారింజ లేదా ముదురు పసుపు రంగులోకి మారుస్తుంది.
- జీలకర్ర (Cumin):కొద్దిగా జీలకర్రను అరచేతిలో తీసుకుని రుద్దాలి. అసలు జీలకర్ర అరచేతికి ఎటువంటి రంగును అంటించదు. నల్లటి రంగు అంటితే అది కల్తీ అయినట్లు (Fake).
- నల్ల మిరియాలు (Black Pepper):ఒక గ్లాసు నీటిలో నల్ల మిరియాలు వేయాలి. అసలు మిరియాలు అడుగుకు చేరతాయి.. అయితే కల్తీ మిరియాలు లేదా బొప్పాయి గింజలు నీటిపై తేలుతాయి.
- ఇంగువ (Asafoetida): ఒక చెంచాలో ఇంగువను తీసుకుని మంటపై కాల్చండి. అసలు ఇంగువ సులభంగా మండుతుంది. ఒకవేళ అది మండకపోతే ఎండు ద్రాక్ష (Raisins) వంటి వాటితో కల్తీ అయినట్లు అర్థం. ఈ చిన్న పరీక్షల ద్వారా కొనే మసాలా దినుసులు స్వచ్ఛమైనవో (Pure) కాదో సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఋతువులతోపాటు వ్యాధులు వస్తాయి.. కారణాలేంటో తెలుసుకోండి