Fasting: ఉపవాసం ఆరోగ్యానికి హానికరమా..? వెలుగులోకి షాకింగ్ నిజాలు

అడపాదడపా ఫాస్టింగ్ చేసే వ్యక్తులకు గుండె జబ్బులు, స్ట్రోక్‌తో మరణించే ప్రమాదం ఉందట. 16 గంటల ఫాస్టింగ్, 8 గంటల ఈటింగ్ విండో చేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇది అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికి మంచిది కాదు.

New Update
Fasting

Fasting

ఈ రోజుల్లో బరువు తగ్గడానికి(Weight Loss), ఫిట్‌నెస్ సాధించడానికి ఫాస్టింగ్(fasting) అనేది ఒక పెద్ద ట్రెండ్. కానీ ఈ పద్ధతి ఆరోగ్యానికి హానికరం అని చాలామందికి తెలియదు. దీనిపై జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌ చేసిన కొత్త అధ్యయనంలో ఆందోళనకరమైన విషయాలను వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం.. అడపాదడపా ఫాస్టింగ్ చేసే వ్యక్తులకు గుండె జబ్బులు, స్ట్రోక్‌తో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది. ఈ అధ్యయనం వేల మందిపై చాలా సంవత్సరాలు సర్వే చేశారు. దీర్ఘకాలికంగా అడపాదడపా ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరానికి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయని ఈ అధ్యయనం కనుగొంది. ఆ విషయాల గురించి కొన్ని  ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

అడపాదడపా ఫాస్టింగ్:

ఈ డైట్ పద్ధతిలో ప్రజలు తమ ఆహార సమయాన్ని పరిమితం చేసుకుంటారు. ఉదాహరణకు.. 16 గంటల ఫాస్టింగ్ మరియు 8 గంటల ఈటింగ్ విండో. దీనివల్ల శరీరంలోని కొవ్వు వేగంగా తగ్గి, జీవక్రియ మెరుగుపడుతుందని భావిస్తారు. కానీ ఈ పద్ధతిని సరైన రీతిలో పాటించకపోతే లేదా ఎక్కువ కాలం చేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందవని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు దీనివల్ల శరీరానికి నష్టాలు జరగవచ్చు. వాటిల్లో పోషకాహార లోపం ఉంటుంది.  పరిమిత సమయంలో తినడం వల్ల అవసరమైన విటమిన్లు, మినరల్స్ లోపించవచ్చు. దీర్ఘకాలికంగా ఈ పద్ధతిని పాటించడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి:ఓవర్ టైం వర్క్‌తో ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలో తెలియటం లేదా..? ఈ చిట్కాలతో పని ఒత్తిడి పరార్!!

డయాబెటిస్(Diabetes) ఉన్న రోగులు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. నిరంతరం ఆకలితో ఉండటం వల్ల మూడ్ స్వింగ్స్, చిరాకు, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. అయితే  అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా  అడపాదడపా ఫాస్టింగ్ అస్సలు చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. నిపుణుల సలహాతో మాత్రమే ఈ పద్ధతిని ప్రారంభించాలి. ఎక్కువ కాలం నిరంతరం ఫాస్టింగ్ చేయకుండా ఉండాలి. ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలు, తగినంత నీరు,  అవసరమైన పోషకాలను చేర్చుకోవాలి. శరీర సంకేతాలను విస్మరించవద్దు. అడపాదడపా ఫాస్టింగ్ అందరికీ ప్రయోజనకరం కాదు. కొంత మందికి ఇది ఉపయోగపడినా.. దీర్ఘకాలికంగా దీన్ని పాటించడం ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు. అందుకే దీన్ని పాటించాలని ఆలోచిస్తున్నట్లయితే ఒకసారి నిపుణుడి సలహా తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:చిన్నారుల మెదడు కంప్యూటర్‌లా వేగంగా పని చేయాలా..? ఈ డ్రైఫ్రూట్స్‌ తినండి!!

Advertisment
తాజా కథనాలు