/rtv/media/media_files/2025/08/23/work-stress-2025-08-23-08-55-37.jpg)
Work Stress
పని ఒత్తిడి తగ్గాలంటే కొన్ని సులభమైన మార్గాలను అనుసరించవచ్చు. ముందుగా పనిని చిన్న భాగాలుగా విభజించుకుని, ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి పనికి ఒక సమయ పరిమితిని పెట్టుకోవడం వల్ల సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఈ రోజుల్లో ఉద్యోగం, డెడ్‌లైన్‌లు, ఓవర్‌టైమ్ మన జీవితంలో భాగమయ్యాయి. ఉదయం ఆఫీస్‌కి వెళ్లడం, రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడం, మరుసటి రోజు అదే రొటీన్. ఈ పరుగులో ఆరోగ్యాన్ని పట్టించుకోవడం చాలామంది మర్చిపోతున్నారు. అయితే మంచి ఆరోగ్యం లేకపోతే దీర్ఘకాలంలో సమర్థవంతంగా పని చేయడం సాధ్యం కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు ప్రకారం.. కొన్ని అలవాట్లను పాటిస్తే పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అదే సమయంలో చురుగ్గా, ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పని మధ్యలో చిన్న విరామాలు:
గంటల తరబడి నిరంతరంగా పని చేయడం వల్ల మనసు, శరీరం రెండింటిపైనా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రతి ఒకట్రెండు గంటలకు 5 నిమిషాల విరామం తీసుకోవాలి. ఈ విరామాల్లో కాస్త స్ట్రెచింగ్ చేయడం, నీళ్లు తాగడం, అటూ ఇటూ నడవడం మంచిది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, శక్తిని పునరుద్ధరిస్తుంది.
సరైన ఆహారం:
ఓవర్‌టైమ్, బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది బయటి ఫాస్ట్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారాన్ని ఆశ్రయిస్తారు. దీనికి బదులుగా, ఆరోగ్యకరమైన స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, పండ్లు, ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇది పోషణను అందించి, పని సామర్థ్యాన్ని పెంచుతుంది.
నిద్ర ముఖ్యం:
నిద్ర లేకపోవడం ఒత్తిడిని పెంచుతుంది. రోజుకు కనీసం 6-8 గంటల నిద్ర తప్పనిసరి. ఇది మెదడును తాజాగా ఉంచి, పని నాణ్యతను మెరుగుపరుస్తుంది. సరైన నిద్రతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం, మనసు శక్తివంతంగా తయారై పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
ఇది కూడా చదవండి: శరీరంలో ఈ లోపం ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరం.. ఈ లక్షణాలను చెక్ చేసుకోండి
వ్యాయామం:
పని ఎంత ఉన్నా.. రోజుకు 20-30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. ఉదయం నడక, యోగా లేదా తేలికపాటి స్ట్రెచింగ్ శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. ఎక్కువసేపు కూర్చుని పని చేసేవారికి నడక విరామాలు చాలా అవసరం. కొన్ని నిమిషాలు నడవడం లేదా వేరే ఏదైనా పని చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
టెక్నాలజీని సరిగా వాడండి:
నిరంతరం స్క్రీన్ చూస్తూ ఉండడం కళ్లకు, మెదడుకు హానికరం. ప్రతి 20 నిమిషాలకు ఏదైనా వస్తువును చూడడం ద్వారా కళ్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే ఉద్యోగులు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలరని నిపుణులు చెబుతున్నారు. పనిలో ఉన్నప్పుడు మధ్యలో విరామం, మనసులో ఉన్న భావాలను పంచుకోవడం లేదా మీ సమస్యలను ఇతరులతో చర్చించడం ద్వారా కూడా ఒత్తిడి తగ్గుతుంది.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ భాగాలలో నొప్పి ఉందా..? ఇది ఆ సమస్యకు సంకేతం కావచ్చు!!