/rtv/media/media_files/2025/10/28/teeth-powder-2025-10-28-19-41-00.jpg)
Teeth Powder
నేటి రోజుల్లో పంటి నొప్పి, సెన్సిటివిటీ, చిగుళ్ల నుంచి రక్తం కారడం, పంటి కుహరం (Cavities) వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల టూత్‌పేస్టులను వాడుతుంటారు. అయితే ఈ పేస్టులు రసాయనాలు, కృత్రిమ పోషకాలతో తయారు చేస్తారు. ఇవి కొన్నిసార్లు దంత సమస్యలను తగ్గించడం కంటే.. మరింత పెంచే అవకాశం ఉంది. పదే పదే వచ్చే దంత సమస్యలతో బాధపడుతూ.. రసాయనాలు లేని టూత్‌పేస్టులకు దూరంగా ఉండాలని అనుకునేవారికి ఇంటి చిట్కా ఎంతో ఉపయోగపడుతాయి. సహజసిద్ధమైన దంతాల పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.ఈ పౌడర్‌ను వాడటం వలన అనేక తీవ్రమైన దంత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ పౌడర్ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
దంతాల పొడికి కావలసిన పదార్థాలు:
ఈ సహజసిద్ధమైన దంతాల పొడిని తయారు చేయడానికి కేవలం ఐదు పదార్థాలు అవసరం ఉంది. వేప పొడి (Neem Powder), లవంగాల పొడి (Clove Powder), పసుపు పొడి (Turmeric Powder), సైంధవ లవణం/రాక్ సాల్ట్ (Rock Salt), వంట సోడా/బేకింగ్ సోడా (Baking Soda) ఇవి అన్ని సిద్దంగా పెట్టుకోవాలి. ఈ సహజసిద్ధమైన పౌడర్‌ను తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక శుభ్రమైన పాత్రను తీసుకోవాలి. దానిలో 2 టీస్పూన్ల వేప పొడి, 1 టీస్పూన్ లవంగాల పొడి, 1 టీస్పూన్ పసుపు పొడి, 1 టీస్పూన్ సైంధవ లవణం మరియు 1 టీస్పూన్ బేకింగ్ సోడా వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి గాలి చొరబడని డబ్బాలో (Air tight container) నిల్వ చేసుకోవాలి. ఒకసారి తయారు చేసుకుంటే ఈ పొడిని 3 నెలల వరకు నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: యాపిల్ మెరవడానికి ఏ కెమికల్ పూస్తారో తెలుసా..? ఇలా గుర్తు పట్టండి!!
ఈ పొడిని ఉపయోగించడానికి.. కొద్ది మొత్తంలో పొడిని చేతిలోకి తీసుకుని బ్రష్‌ను కొద్దిగా తడిపి.. టూత్‌పేస్ట్‌లాగా దానికి అప్లై చేయాలి. కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు దంతాలను శుభ్రంగా తోమాలి. ఈ పొడిని చిగుళ్ళకు (Gums) కూడా తప్పకుండా రాయాలి. ఆ తరువాత.. గోరువెచ్చని నీటితో (Lukewarm water) పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. వేప, లవంగాలులో ఉండే గుణాలు దంతాలలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అంతేకాక పంటి నొప్పిని నివారిస్తాయి, చిగుళ్లను బలోపేతం చేస్తాయి. ఈ సహజసిద్ధమైన దంతాల పొడిని ఉపయోగించడం ద్వారా పసుపు రంగు (Yellowness) తగ్గిపోయి. దంతాలు మరింత తెల్లగా, ప్రకాశవంతంగా మెరుస్తాయి. ఈ సహజసిద్ధమైన ఇంటి చిట్కాను పాటించి దంత సమస్యలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: జుట్టు సమస్యలు ఎన్నైనా.. మ్యాజిక్ హెయిర్ ఆయిల్ ఒక్కటి చాలు!!
Follow Us