Hair Fall: జుట్టు సమస్యలు ఎన్నైనా.. మ్యాజిక్ హెయిర్ ఆయిల్ ఒక్కటి చాలు!!

జుట్టు రాలడం, జుట్టు చిట్లడం అనేది సాధారణ సమస్యగా మారింది. కేవలం 7 రోజుల్లో జుట్టు రాలడం, చిట్లడం, తెల్లబడడం వంటి సమస్యలను ఆపగలిగే ఒక అద్భుతమైన మ్యాజిక్ హెయిర్ ఆయిల్ ఉంది. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Hair Fall

Hair Fall

నేటి కాలంలో కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల చాలా మంది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం (Hair Fall), జుట్టు చిట్లడం (Hair Breakage) అనేది సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నా.. చాలామందికి చెప్పుకోదగిన ప్రయోజనం లభించడం లేదు. జుట్టు రాలడం, చిట్లడం సమస్యలతో బాధపడుతుంటే.. కొన్ని ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. కేవలం 7 రోజుల్లో జుట్టు రాలడం, చిట్లడం, తెల్లబడడం (Graying) వంటి సమస్యలను ఆపగలిగే ఒక అద్భుతమైన మ్యాజిక్ హెయిర్ ఆయిల్ ఉంది. ఈ నూనె చుండ్రు (Dandruff) మరియు పేలను కూడా తొలగిస్తుందట. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

మ్యాజిక్ ఆయిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

ఈ మ్యాజికల్ హెయిర్ ఆయిల్‌ను తయారు చేయడానికి కావాల్సినవి.. కలబంద ఆకులు (Aloe Vera Leaves) 2, కొబ్బరి నూనె (Coconut Oil) ఒక కప్పు, వేప ఆకులు (Neem Leaves) కొన్ని, కరివేపాకు (Curry Leaves) కొన్ని సిద్ధంగా పెట్టుకోవాలి. ఈ మ్యాజిక్ ఆయిల్ తయారీ విధానం
ఈ నూనెను తయారు చేయడం చాలా సులభం చేయవచ్చు. ముందుగా రెండు కలబంద ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మెత్తగా రుబ్బి పేస్ట్‌లా తయారు చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఒక కప్పు కొబ్బరి నూనె, కొద్దిగా వేప ఆకులు,  కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. మిశ్రమం చల్లారిన తరువాత దాన్ని ఒక పాత్రలో వడకట్టి నిల్వ ఉంచుకోవాలి. ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ మ్యాజికల్ హెయిర్ ఆయిల్‌ను జుట్టుకు, కుదుళ్లకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో (Lukewarm water) జుట్టును శుభ్రం చేసుకోవాలి.

 ఇది కూడా చదవండి: ఓర్నీ.. ఒక్క లవంగంతో ఇన్ని లాభాలా.. రాత్రి పూట నోట్లో వేసుకుని పడుకుంటే..!

ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం, చిట్లడం, తెల్లబడడం ఆగిపోతుంది. కలబంద (Aloe Vera)లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, జుట్టును తేమగా ఉంచుతాయి. కొబ్బరి నూనె (Coconut Oil)లో ఉండే పోషకాలు జుట్టును బలంగా, ఆరోగ్యంగా మారుస్తాయి. అంతేకాక జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వేప, కరివేపాకు (Neem and Curry Leaves)లో ఉండే పోషకాలు జుట్టును పొడవుగా, దృఢంగా మార్చడానికి సహాయపడతాయి. ఈ సహజమైన నూనెను ఉపయోగించి.. కేవలం వారంలోనే ఆరోగ్యవంతమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి:యాపిల్ మెరవడానికి ఏ కెమికల్ పూస్తారో తెలుసా..? ఇలా గుర్తు పట్టండి!!

Advertisment
తాజా కథనాలు