/rtv/media/media_files/2025/07/27/mantra-2025-07-27-18-13-19.jpg)
Mantra
Katyayani Mantra: ప్రతి తల్లి తండ్రి తమ కూతురికి మంచి జీవిత భాగస్వామి లభించాలని, ఆమె జీవితం సుఖంగా గడవాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు గ్రహాల స్థితి, నక్షత్రాల ప్రభావం లేదా జాతకంలోని మంగళ దోషం వంటివి వివాహానికి అడ్డంకులు కలిగిస్తుంటాయి. వయస్సు పెరిగినా పెళ్లి విషయమై పురోగతి లేకపోతే.. అది ఆ కుటుంబానికి భారం లాంటిదిగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికంగా కొన్ని మార్గాలను అనుసరించడం ద్వారా శుభ ఫలితాలు పొందొచ్చు. ఈ నేపథ్యంలో శక్తివంతమైన కాత్యాయనీ మంత్రాన్ని మంచి ఫలితం ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది పెళ్లికాని యువతులకు ఆశాజనక మార్గంగా మారుతుందని పేర్కొన్నారు. ఆ మంత్రం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మంగళదోషం ఉపశమనం..
ఈ మంత్రం భగవత్పురాణంలోనూ ప్రస్తావించబడింది. “కాత్యాయనీ మహామాయే, మహాయోగిన్యధీశ్వరి, నందగోపసుతం దేవి, పతిం మే కురు తే నమః” అనే ఈ మంత్రాన్ని ప్రతి రోజు భక్తితో జపించాలి. గోపికలు కూడా కృష్ణుడిని తన భర్తగా కోరుకుంటూ ఇదే మంత్రాన్ని జపించారని పురాణ గాథల్లో చెప్పబడింది. కాత్యాయనీ దేవి దుర్గామాత యొక్క ఆరవ రూపంగా చెబుతారు. ఆమెను పూజించడం వల్ల మంగళదోషం ఉపశమనం పొందుతుంది. అలాగే వివాహంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించడం ద్వారా శక్తివంతమైన ఫలితాలు కనిపించవచ్చు. శాస్త్రాల్లో దీన్ని 1,25,000 సార్లు జపించాలని సూచించబడింది. ఉదయం స్నానం చేసి శుద్ధంగా ఉండాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించి కాత్యాయనీ దేవిని స్మరిస్తూ శుద్ధచిత్తంతో మంత్రాన్ని జపించాలి. ఈ సాధనలో పవిత్రత అత్యంత ముఖ్యం. మంత్రాన్ని నిశ్చలమైన మనస్సుతో.. పూర్తిగా భక్తితో జపించాలి. ఈ విధంగా చేస్తే పెళ్లిలో ఎదురవుతున్న అన్ని విధాలైన అడ్డంకులు తొలగిపోతాయని.. తగిన వరుడు లభిస్తాడని నమ్మకం. కాత్యాయనీ మాత ఆశీర్వాదంతో యువతుల జీవితాల్లో శాంతి, ఆనందం, సంపూర్ణత వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది కేవలం మానసిక బలాన్ని పెంచడమే కాక.. విశ్వాసాన్ని గట్టి చేసి భవిష్యత్‌పై ఆశను పెంపొందించే మార్గంగా నిలుస్తుందని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: వివాహం చేసుకోని వారికి.. ఈ ఉపవాసంతో ఆ దోషాల నుంచి విముక్తి
( life-mantra | Latest News)