Hair Care: హెయిర్ స్పాకి వెళ్ళేముందు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే మీ జుట్టు సంగతి అంతే!!

హెయిర్ స్పా చేయించుకోవడం వలన జిడ్డుగా, పొడిబారిన జుట్టు కొంతవరకు మెరుగవుతుంది. ఇందులో రసాయనాలు తక్కువగా వాడతారు కాబట్టి.. కెరాటిన్, హెయిర్ బోటాక్స్ వంటి చికిత్సల కంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Hair care Hair spa

Hair care Hair spa

ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం(hair-fall-tips) అనేది అన్ని వయసుల వారిలో సర్వసాధారణ సమస్యగా మారింది. ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం, రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను అతిగా వాడటం వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య పెరుగుతోంది. దీన్ని నివారించడానికి చాలా మంది హెయిర్ స్పా వంటి చికిత్సలను ఆశ్రయిస్తున్నారు. అయితే హెయిర్ స్పా నిజంగా జుట్టు రాలడాన్ని ఆపగలదా..? నిపుణులు ఏం చెబుతున్నారో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

హెయిర్ స్పా నిజాలు:

జుట్టు సంరక్షణ(hair-care-tips నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హెయిర్ స్పా అనేది తల చర్మం (Scalp), జుట్టుకు పోషణ అందించే అనేక దశల చికిత్స. హెయిర్ స్పా చేయించుకోవడం వలన జిడ్డుగా, పొడిబారిన జుట్టు కొంతవరకు మెరుగవుతుంది. ఇందులో రసాయనాలు తక్కువగా వాడతారు కాబట్టి.. కెరాటిన్, హెయిర్ బోటాక్స్ వంటి చికిత్సల కంటే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. నిపుణులు చెబుతున్న ముఖ్య విషయం ఏమిటంటే హెయిర్ స్పా తల చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది (Deeply Cleanses). తల చర్మం శుభ్రంగా ఉంటే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, పెరుగుదలకు సహాయపడుతుంది. అయినప్పటికీ.. జుట్టు రాలడానికి గల అంతర్లీన కారణాన్ని (Underlying Cause) హెయిర్ స్పా నయం చేయలేదు.

ఇది కూడా చదవండి: పిల్లల చర్మం ఎంతో సున్నితం.. ఈ 3 వస్తువులు ఉంచండి వారికి దూరం!

జుట్టు ఆహార లోపం లేదా అధిక ఒత్తిడి కారణంగా రాలుతున్నట్లయితే.. స్పా చేయించుకున్న తర్వాత కూడా అది కొనసాగుతుంది. అయితే ఇది తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు పట్టులా మెరిసేలా (Silky and Shiny) చేస్తుంది. హెయిర్ స్పా జుట్టు రాలడాన్ని పూర్తిగా నయం చేయలేదు. జుట్టు రాలడం తగ్గాలంటే.. నిపుణులు ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. జుట్టు రాలడం అధికంగా ఉంటే.. స్పా చికిత్సల కంటే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: రోజుకు రెండు ఖర్జూర పండ్లు.. ఎన్నెన్నో ప్రయోజనాలు

Advertisment
తాజా కథనాలు