Bad Sweat : చెమట కంపు కొండుతుందా.. అయితే ఈ రోగాలున్నాయేమో చెక్ చేసుకోండి!!

చెమట వాసన కేవలం బాహ్య కారణాలకే పరిమితం కాదు. ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు. అయితే చెమట వాసన వెనుక ఉన్న ఆనారోగ్య సమస్యలు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
bad sweat

bad sweat

చెమట(sweat) పట్టడం అనేది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సాధారణ ప్రక్రియ. అయితే.. ఆ చెమట వింతగా, తీవ్రంగా లేదా భరించలేని దుర్వాసన వస్తుంటే.. దాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. చర్మ సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చెమట వాసన కేవలం బాహ్య కారణాలకే పరిమితం కాదు. ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెమట నుంచి వచ్చే వింత వాసన ఏ వ్యాధిని సూచిస్తుంది..? నిపుణుల సలహా, పరిష్కారాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

చెమట వాసన వెనుక ఉన్న ఆనారోగ్య సమస్యలు:

మధుమేహం (Diabetes) కీటోన్ బ్రీత్:

చెమట తీపిగా (Sweet) లేదా పండ్ల వాసన (Fruity) వస్తుంటే.. అది మధుమేహం (డయాబెటిస్) యొక్క సంకేతం కావచ్చు. శరీరంలో ఇన్సులిన్ లేకపోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పినప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. నియంత్రణలో లేని డయాబెటిస్ ఉన్నవారిలో.. అదనపు గ్లూకోజ్ చెమట ద్వారా వాసన రూపంలో విడుదల కావచ్చు. వైద్య పరిభాషలో దీనిని కీటోన్ బ్రీత్ అంటారు.

కాలేయం- మూత్రపిండాల సమస్యలు:

చెమట నుంచి అమోనియా లేదా మూత్రం వంటి బలమైన వాసన వస్తుంటే.. అది కాలేయం (Liver) లేదా మూత్రపిండాల (Kidney) లోపానికి సంకేతం కావచ్చు. శరీరం వ్యర్థ ఉత్పత్తులను (Waste Products) మూత్రం లేదా చెమట ద్వారా సరిగ్గా తొలగించలేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి లేదా కాలేయ సిర్రోసిస్ వంటి పరిస్థితుల్లో ఈ లక్షణం మరింత స్పష్టంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: కోవిడ్ ఇన్‌ఫెక్షన్ తిరగబడితే పిల్లలకు దీర్ఘకాలిక ఇబ్బందులు తప్పవు

థైరాయిడ్ అసమతుల్యత:

హైపర్‌థైరాయిడిజం వంటి పరిస్థితులు కూడా చెమట పరిమాణం, వాసన పెరగడానికి కారణమవుతాయి. హార్మోన్లలో వచ్చే ఈ అసమతుల్యత శరీరంలోని రసాయన ప్రతిచర్యలను ప్రభావితం చేసి.. చెమట వాసనలో మార్పులకు దారితీస్తుంది.

బ్యాక్టీరియా-ఫంగల్ ఇన్ఫెక్షన్లు:

చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ఫంగస్‌లు చెమటతో కలిసి దుర్వాసనను కలిగించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. వాసన మామూలు కంటే బలంగా, ఎక్కువ కాలం ఉంటే.. అది బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది.

అయితే చెమట దుర్వాసనను నివారించే మార్గాలు ఉన్నాయి. వాటిల్లో రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేయండి. ముఖ్యంగా ఎక్కువ చెమట పట్టే శరీర భాగాలను శుభ్రం చేయాలి. అంతేకాక తేలికపాటి, నూలు (Cotton) దుస్తులు ధరించటం ద్వారా చెమట త్వరగా ఆరిపోతుంది. శరీరం నుంచి విషాలను (Toxins) బయటకు పంపడానికి సమతుల్య ఆహారం తీసుకుని.. తగినంత నీరు తాగాలి. వాసన సమస్యకు మూలకారణాన్ని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లేదా నడక వంటివి చేస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: బియ్యం పిండి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగకరమండి!!

Advertisment
తాజా కథనాలు