/rtv/media/media_files/2025/08/18/chia-seeds-curd-benefits-2025-08-18-06-56-32.jpg)
Chia Seeds-Curd Benefits
చియా సీడ్స్ చిన్నవి, నల్లగా ఉండే విత్తనాలు. ఇవి సాల్వియా హిస్పానికా అనే మొక్క నుంచి వస్తాయి. ఈ విత్తనాలు ఒకప్పుడు మెక్సికో, గ్వాటెమాల ప్రజల ప్రధాన ఆహారం. చియా సీడ్స్‌లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్‌కు మంచి మూలం. చియా సీడ్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం చాలా సులభం. వీటిని నీటిలో నానబెట్టి, స్మూతీస్, ఓట్మీల్, పుడ్డింగ్‌లలో వాడవచ్చు. ఈ విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. అయితే చాలామంది చియా సీడ్స్‌ని నీటిలో కలిపి తాగుతుంటారు. అయితే వీటిని పెరుగులో కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉండే ప్రొటీన్, ఫ్యాట్, ప్రోబయోటిక్స్ చియా సీడ్స్ యొక్క లాభాలను మరింత పెంచుతాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
చియా సీడ్స్-పెరుగు లాభాలు:
రెండు చెంచాల చియా సీడ్స్‌లో దాదాపు 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా శరీరానికి నేరుగా అందుతుంది. ఈ రెండింటి కలయిక జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
పెరుగులో క్యాల్షియం, పొటాషియం, బి-విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్‌లో ఒమేగా-3, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కలిసి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: అధిక రక్తపోటు, కిడ్నీ రోగులకు శుభవార్త.. పండ్లు, కూరగాయలతో మెరుగైన ఆరోగ్యం
పెరుగుతో కలిపి చియా సీడ్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ కాంబినేషన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు క్రమంగా పెరుగుతాయి. తద్వారా ఎక్కువసేపు శక్తిని అందిస్తుంది. కేవలం నీటిలో తాగడం కంటే పెరుగుతో చియా సీడ్స్ తినడం వల్ల రుచిగా ఉంటుంది. వీటిని ఓవర్‌నైట్ పుడ్డింగ్, పారఫైట్, స్మూతీ, లేదా ఫ్రోజెన్ యోగర్ట్ పాప్స్‌లో కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల రకరకాల రుచులు, టెక్స్‌చర్స్ ఆస్వాదించవచ్చు. చియా సీడ్స్‌ని నీటితో తీసుకోవడం మంచిదే అయినప్పటికీ.. పెరుగుతో కలిపి తీసుకుంటే పోషకాలు, రుచి, ఆరోగ్య లాభాలు మరింత పెరుగుతాయి. ఇది ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన ఎంపికని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నల్ల ద్రాక్ష రసం ఆరోగ్యానికి అమృతం.. దీనిని తాగే విధానం తెలుసుకోండి