High BP And Kidney: అధిక రక్తపోటు, కిడ్నీ రోగులకు శుభవార్త.. పండ్లు, కూరగాయలతో మెరుగైన ఆరోగ్యం

పండ్లు, కూరగాయలు, బేకింగ్ సోడా రెండూ మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయి. అంతేకాకుండ రక్తపోటును తగ్గించడంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే ప్రభావవంతంగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది.

New Update
High BP And Kidney

High BP And Kidney

High BP And Kidney: అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలున్నవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార నియమాలను పాటించడం చాలా ముఖ్యం. సరైన ఆహారం కిడ్నీల పనితీరును మెరుగుపరచి, రక్తపోటును(high bp) నియంత్రించడంలో సహాయపడుతుంది. ఏ ఆహారాలు తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి, ఎలాంటి పోషకాలు  ఆరోగ్యానికి మేలు చేస్తాయో ముందుగా తెలుసుకోవాలి. తక్కువ సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఉన్న ఆహారాలు ఈ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. అయితే అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఊరట కలిగించే ఒక కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. కేవలం ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు రక్తపోటును నియంత్రించవచ్చని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.  ఈ రోగులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు, వాటి ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆహార ప్రణాళిక..

అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్‌లో ఐదేళ్ల పాటు సాగిన ఈ పరిశోధన 153 మంది అధిక రక్తపోటు, మాక్రోఆల్బుమినూరియా రోగులపై నిర్వహించారు. ఈ అధ్యయనంలో రోగులను మూడు సమూహాలుగా విభజించారు. మొదటి సమూహానికి రోజుకు 2-4 కప్పుల పండ్లు, కూరగాయలు ఇచ్చారు. రెండవ సమూహానికి రోజుకు రెండుసార్లు బేకింగ్ సోడా మాత్రలు ఇచ్చారు. మూడవ సమూహానికి సాధారణ వైద్య సంరక్షణ మాత్రమే అందించారు. పరిశోధన ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. పండ్లు, కూరగాయలు మరియు బేకింగ్ సోడా రెండూ మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయి. అయితే రక్తపోటును తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే ప్రభావవంతంగా ఉన్నాయని తేలింది. బేకింగ్ సోడా ఈ ప్రయోజనాలను అందించలేదు.

ఇది కూడా చదవండి: ఒకే రకమైన అల్పాహారం బోర్‌ కొట్టిందా..? ఈ ఆరోగ్యకరమైన వాటిని తిని చూడండి..!!

ఈ అధ్యయన నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోగికి మూత్రపిండాల ఆరోగ్యానికి బేకింగ్ సోడా మరియు పండ్లు, కూరగాయలు రెండూ ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే రక్తపోటు నియంత్రణ, గుండె జబ్బుల నుంచి రక్షణ పండ్లు మరియు కూరగాయల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల అధిక రక్తపోటు రోగులకు పండ్లు, కూరగాయలు కీలకమైన చికిత్సగా పరిగణించాలి. ఈ ఫలితాల ప్రకారం.. అధిక రక్తపోటు మరియు కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు తమ రోజువారీ ఆహారంలో 2-4 కప్పుల ఆకుకూరలు, దోసకాయ, టమాటో, క్యారెట్, బొప్పాయి, ఆపిల్, నారింజ వంటివి చేర్చుకోవాలి. జంక్ ఫుడ్, అధిక ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఆ జ్యూస్ తాగితే అనేక అనారోగ్య సమస్యలకు చెక్.. సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి!

Advertisment
తాజా కథనాలు