/rtv/media/media_files/2025/07/16/fever-in-pregnancy-2025-07-16-20-40-05.jpg)
Fever and pregnancy
నేటికాలంలో గర్భధారణ సమయంలో స్త్రీల ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో మహిళలకు జ్వరం వస్తే తరచుగా ఏ మందులు తీసుకోవాలి..? ఏది తీసుకోకూడదో..? అని భయపడతారు. ఆలోచించకుండా ఏదైనా మందులు తీసుకుంటే మీకు, బిడ్డకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గర్భధారణ సమయంలో జ్వరం వచ్చినప్పుడు ఏమి చేయాలో, ఏ మందులు తీసుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
గర్భధారణలో జ్వరం వస్తే చేయాల్సిన పని:
గర్భవతిగా ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి కొద్దిగా బలహీనంగా ఉంటుంది. ఇది జలుబు, జ్వరం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. జ్వరం వచ్చినప్పుడు ముందుగా ఏమి చేయాలో తెలుసుకోవాలి. వైద్యుడిని సంప్రదించకుండా ఏ ఔషధం తీసుకోవద్దు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పుష్కలంగా నీరు, జ్యూస్, సూప్ తాగాలి. వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. శరీరం కోలుకోవడానికి విశ్రాంతి అవసరం. జ్వరం ఎక్కువగా ఉంటే.. ఆమె నుదిటిపై కోల్డ్ వాటర్ కంప్రెస్ పెట్టాలి. గోరువెచ్చని నీటితో స్పాంజ్ చేస్తూ ఉండాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గర్భధారణలో జ్వరాన్ని తగ్గించడానికి అత్యంత సురక్షితమైన పారాసెటమాల్ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఎక్కువ ఉప్పుతో లక్షలాది మంది ప్రాణాలు గాలిలోకి.. షాకింగ్ విషయాలు ఇవే
ఈ ఔషధం శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో, శిశువుకు సురక్షితమైనదిగా చెబుతున్నారు. గర్భధారణలో జ్వరం, నొప్పికి ఇది అత్యంత సిఫార్సు చేయబడిన ఔషధం. డాక్టర్ సూచించిన మోతాదు, సమయానికి అనుగుణంగా పారాసెటమాల్ తీసుకోవాలి. వైద్యుడిని సంప్రదించకుండా ఎప్పుడూ యాంటీ బయాటిక్స్ తీసుకోవద్దు. సరైన పరీక్ష తర్వాత, వైద్యుడి పర్యవేక్షణలో మాత్రమే యాంటీ బయాటిక్స్ తీసుకోవాలి. గర్భధారణలో జ్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించిన తర్వాతే మందులు తీసుకుంటూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీ ఆరోగ్యానికి మీ పిల్లల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్ కార్డులు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నిద్ర, ఆరోగ్యం రెండింటిలోనూ ప్రయోజనాలు కావలా..? రాత్రి ఇలా చేసి చూడండి..!!
(Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | fever)