/rtv/media/media_files/2025/07/16/aadhaar-card-2025-07-16-14-13-43.jpg)
Aadhaar Card
ఆధార్ కార్డులకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. దేశంలో ఇప్పటిదాకా కోట్లాది మంది మరణించినా కూడా చాలావరకు ఆధార్‌లు ఇంకా యాక్టివ్‌లోనే ఉన్నాయి. ఆధార్ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి కేవలం 1.15 కోట్ల ఆధార్‌లు మాత్రమే డీయాక్టివేట్ అయినట్లు ఉడాయ్ (UIDAI) వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం బయటపడినట్లు ఏ జాతీయ మీడియా పేర్కొంది.
Also Read: సినిమా టికెట్ల ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!
RTI Finds Only 1.15 Crore Aadhaar Cards Deactivated
ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం 16 ఏళ్ల క్రితం ఆధార్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. 2025 జూన్ నాటికి 142.39 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రకారం చూసుకుంటే.. దేశ జనాభా ప్రస్తుతం 146.39 కోట్లు ఉంది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CSR) డేటా ప్రకారం 2007 నుంచి 2019 మధ్య సగటున ప్రతీ సంవత్సరం 83.5 లక్షల మంది మృతి చెందారు. ఇన్నేళ్ల నుంచి కోట్లాది మంది మృతి చెందినప్పటికీ ఉడాయ్ డీయాక్టివేట్ చేసిన ఆధార్ నెంబర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
Also Read: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం
కేవలం 10 శాతం (1.15 కోట్ల) ఆధార్‌లను మాత్రమే కేంద్రం డీయాక్టివేట్ చేసింది. అయితే ఈ ప్రక్రియ అనేది డెత్ సర్టిఫికేట్, కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగానే జరుగుతుందని దరఖాస్తుదారుడికి ఉడాయ్ చెప్పింది. అయితే ప్రస్తుతం ఈ వ్యత్యాసంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేయడం వల్ల యాక్టివ్‌గా ఉన్న ఆధార్ కార్డులను దుర్వినియోగం చేసే అవకాశాలుంటాయని పేర్కొంది. అలాగే ప్రభుత్వ స్కీమ్స్, సబ్సిడీలు, ఐడీ లింక్ ఉండే ఇతర సర్వీసులపై కూడా ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేక్ ఆధార్‌లను నివారించేందుకు సివిల్ డెత్ రిజిస్ట్రీలు, ఆధార్ డేటాబేస్ నిర్వహణలో సమన్వయం ఉండాలని.. ఇది వెంటనే అవసరమని చెప్పారు.
Also Read : తిరుమలలో కలకలం.. లోయలో దూకిన భక్తుడు
telugu-news | rtv-news | aadhar-card | national-news