/rtv/media/media_files/2025/12/08/fast-food-2025-12-08-16-17-27.jpg)
Fast food
నేటి ఆధునిక జీవనశైలి(daily-life-style)లో చర్మ సంబంధిత సమస్యలు(healthy life style) సర్వసాధారణం అయినప్పటికీ... ప్రపంచవ్యాప్తంగా యువతులలో వేగంగా పెరుగుతున్న మరో సమస్య హిర్సుటిజం (Hirsutism). ముఖంపై, గడ్డంపై లేదా పెదవుల పైన కొందరికి మీసాలు, గడ్డాలు(unwanted-hair) వంటి అవాంఛిత రోమాలు తేలికపాటి లేదా దట్టమైన రూపంలో పెరగడం ఈ పరిస్థితి లక్షణం. ఇది కేవలం సౌందర్య సమస్య మాత్రమే కాదు.. అంతర్గత హార్మోన్ల అసమతుల్యతకు స్పష్టమైన సంకేతం. ఈ సమస్య పెరగడానికి కారణాలు ఏమిటి..? దీన్ని ఎలా పరిష్కరించవచ్చో WHO నిపుణుల అభిప్రాయాలను ఈ ఆర్టికల్‌లో కొన్ని తెలుసుకుందాం.
హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణం:
అవాంఛిత రోమాల పెరుగుదలకు ప్రధానంగా హార్మోన్ల అసమతుల్యత కారణం. స్త్రీలలో సాధారణంగా ఉండే పురుష హార్మోన్లు, ముఖ్యంగా ఫ్రీ టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగినప్పుడు హిర్సుటిజం వస్తుంది. అయితే.. ఈ హార్మోన్ల అసమతుల్యతకు ఇటీవల కాలంలో ప్రధానంగా దోహదపడుతున్న కారకం.. ఫాస్ట్ ఫుడ్(fast-food), అనారోగ్యకరమైన జీవనశైలి. ఓ నివేదిక ప్రకారం.. నేటి యువత అధికంగా తీసుకుంటున్న ఫాస్ట్ ఫుడ్స్ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఆహారంలో చక్కెర, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్లు అత్యధికంగా ఉంటాయి. ఈ పదార్థాలు శరీరంలోకి చేరినప్పుడు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. అంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి శరీరం అధికంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఈ పెరిగిన ఇన్సులిన్ స్థాయిలు అండాశయాలు (Ovaries), అడ్రినల్ గ్రంధుల నుంచి పురుష హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగడం వల్ల స్త్రీలలో అవాంఛిత రోమాలు పెరగడం ప్రారంభమవుతుంది. ఫాస్ట్ ఫుడ్ నేరుగా వెంట్రుకలను పెంచదు.. కానీ ఇది బరువు పెరగడానికి, హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది.. తద్వారా హిర్సుటిజం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రుతుక్రమం-బరువు పెరుగుదల:
రుతుస్రావం (Menstruation) ప్రారంభమయ్యే సమయంలో అమ్మాయిల శరీరాలలో సహజంగా హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. ఈ కీలక సమయంలో జంక్ ఫుడ్స్, నూనెలో వేయించిన పదార్థాలను అధికంగా తీసుకుంటే.. హిర్సుటిజం వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. యువతులు బరువు పెరిగినప్పుడు.. వారి ఈస్ట్రోజెన్ స్థాయిలు తరచుగా పెరుగుతాయి. అయితే కొన్నిసార్లు హైపోథాలమిక్-పిట్యూటరీ-అడ్రినల్ సిస్టమ్‌లో లోపం కారణంగా అడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేసే ఫ్రీ టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా పెరుగుతాయని గైనకాలజిస్ట్ నిపుణులు అంటున్నారు. ఈ ఫ్రీ టెస్టోస్టెరాన్ స్థాయిల పెరుగుదల అసాధారణ రోమాల పెరుగుదలకు దారితీస్తుందని చెబుతున్నారు.
అదనపు సమాచారం:
అవాంఛిత రోమాల పెరుగుదలకు (హిర్సుటిజం) అత్యంత సాధారణ వైద్య కారణం.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS). PCOS అనేది స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీసే ఒక సాధారణ ఎండోక్రైన్ రుగ్మత. PCOS ఉన్న స్త్రీలలో అధిక ఆండ్రోజెన్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే హిర్సుటిజంతోపాటు.. PCOS వల్ల క్రమరహిత రుతుస్రావం.. అండాశయాలలో తిత్తులు (Cysts), వంధ్యత్వం, మొటిమలు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. PCOS రావడానికి కూడా ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణాలు. అందువల్ల ముఖంపై వెంట్రుకలు పెరిగినప్పుడు అది PCOS లేదా మరొక తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు కాబట్టి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చెపించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు-చికిత్స:
హిర్సుటిజం సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు యువతులు తరచుగా చేసే పొరపాట్లలో ఒకటి ఉంటుంది. అది చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించకుండా ఇంట్లో దొరికే చిట్కాలు లేదా షేవింగ్ వంటివి ఉపయోగించడం వంటివి చేస్తారు. షేవింగ్ చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఇది వెంట్రుకలు మరింత దళసరిగా.. వేగంగా పెరిగేలా చేయవచ్చు. వైద్య నిపుణుల సలహా లేకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించడం కూడా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్మోన్ల స్థాయిలను పరీక్షించడం ద్వారా అసలు హార్మోన్ల అసమతుల్యతను గుర్తించాలి. PCOS లేదా అడ్రినల్ గ్రంథి సమస్యలు వంటి అంతర్లీన కారణాలను నిర్ధారించాలని అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో విజృంభిస్తోన్న స్క్రబ్ టైఫస్ .. 8కి చేరిన స్క్రబ్ డెత్స్.. కరోనా అంత డేంజరా..?
జీవనశైలి మార్పులు:
ఆరోగ్యకరమైన బరువును సాధించడం, నిర్వహించడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. ఫాస్ట్ ఫుడ్, అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు అధికంగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీ-ఆండ్రోజెన్ మందులు లేదా హార్మోన్ల సమతుల్యత కోసం ఇతర మందులను తీసుకోవాలి. దీర్ఘకాలికంగా అవాంఛిత రోమాలను తొలగించడానికి లేజర్ ట్రీట్మెంట్ లేదా ఎలక్ట్రోలైసిస్ వంటి పద్ధతులను వైద్యుల సలహా మేరకు ఉపయోగించవచ్చని వైద్యులు అంటున్నారు. అయితే ఆహారపు అలవాట్లు, శరీర బరువు, హార్మోన్ల మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని యువత అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. హిర్సుటిజం కేవలం ఒక లక్షణం మాత్రమే.. దీని వెనుక ఉన్న హార్మోన్ల అసమతుల్యతను సరిదిద్దడం ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కేరళలో కొత్త రోగం.. 42 మంది మృతి.. డేంజర్లో 170 మంది.. ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలుసా..?
Follow Us