/rtv/media/media_files/2025/07/21/heart-diseases-2025-07-21-15-09-06.jpg)
Heart Diseases
భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలలో గుండె జబ్బుల పెరుగుదల ఒక తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గుండె సంబంధిత మందుల అమ్మకాలు 50 శాతానికిపైగా పెరిగినట్లు తెలుస్తోంది. దేశంలో గుండె జబ్బుల వ్యాప్తి ఎంత వేగంగా ఎందుకు పెరుగుతోందో తెలుసుకోవటానికి.. ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ కంపెనీ సర్వే చేశారు. వారి నివేదిక ప్రకారం.. 2021లో గుండె సంబంధిత మందుల విక్రయాలు రూ.1,761 కోట్లుగా ఉండగా, 2025 నాటికి అవి రూ.2,645 కోట్లకు చేరనున్నాయి. ఇది ఏడాదికి సగటున 10.7 శాతం పెరుగుదల అని అర్థం. ఈ మందుల అమ్మకాలు ఇప్పుడి ఇన్ఫెక్షన్, డయాబెటిస్, గ్యాస్ట్రిక్ మందుల కంటే ఎక్కువగా ఉన్నట్లు వారి సర్వేలో తేలింది.
Also Read : తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. భర్తతో ఫొటోలు వైరల్!
గుండె ఆరోగ్యం గురించి అవగాహన..
డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం.. భారతదేశంలో వృద్ధుల జనాభా పెరగడం ఒక ప్రధాన కారణం. వయస్సుతోపాటు గుండె బలహీనపడడం సహజం. అంతేకాక అధిక రక్తపోటులో మార్పు రావడం, 120 కంటే ఎక్కువ విలువకే ప్రమాదంగా పరిగణించడం కూడా గుండె సంబంధిత రోగాల పెరుగుదలకు దోహదం చేస్తోంది. దీనికి తోడు గుండె ఆరోగ్యం గురించి అవగాహన పెరగడం, ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం వంటి దశల వల్ల కూడా గణాంకాలు పెరిగినట్లు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు మీ చేతులు, కాళ్ళలో కనిపిస్తే.. అది అధిక కొలెస్ట్రాల్‌తోపాటు..!!
ప్రధాన గుండె సంబంధిత వ్యాధుల్లో కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెపోటు, స్ట్రోక్ ముఖ్యమైనవి. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తప్రవాహం ఆగిపోవడం, గుండె కండరానికి రక్తం అందకపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. అలాగే మెదడుకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు స్ట్రోక్ జరుగుతుంది. ఒక్కోసారి గుండె స్పందన అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఇది ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. ఈ పరిస్థితికి దోహదం చేసే అంశాల్లో క్రమరహిత జీవనశైలి, ఒత్తిడి, ధూమపానం, మద్యం సేవనం, అధిక బరువు, రక్తపోటు, మధుమేహం వంటి అంశాలు ఉన్నాయి. గుండెపోటుకు తట్టిపోయే కారణం కనిపించకపోయినా, జీవనశైలి ముఖ్య పాత్ర పోషిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
Also Read : పూంచ్ లో పాఠశాలపై విరిగిపడ్డ కొండ చరియలు..స్పాట్‌లో..
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: బుధవారం గణపతి పూజతో అష్టైశ్వర్యాలు!
heart-diseases | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news