/rtv/media/media_files/2025/07/19/ganapati-puja-2025-07-19-15-04-57.jpg)
Ganapati Puja
Ganapati Puja: విఘ్నహర్త, బుద్ధిదాత, మంగళకారిగా పూజలందుకునే వినాయకుడిని కొలవడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. బుధవారం పూజకు బుధ గ్రహంతో సంబంధం ఉంది. ఈ రోజున గజాననుడిని నిష్ఠగా పూజిస్తే కెరీర్‌లో మంచి ఫలితాలు లభిస్తాయి. బుధవారం చేయాల్సిన కొన్ని పురాతన ఉపాయాలు, వాటి ప్రయోజనాలు గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
శాస్త్రాలలో చెప్పబడిన బుధవారం ఉపాయాలు:
గణేశ స్తోత్ర పారాయణం: నారద పురాణం ప్రకారం.. బుధవారం కనీసం 11 సార్లు గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఇంట్లో, కుటుంబంలో సుఖ శాంతులు వెల్లి విరుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లోపించి, కలహాలు ఉన్నట్లయితే.. ఈ స్తోత్రాన్ని రోజూ పఠించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. బుధ దోష నివారణకు: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సందర్భంలో బుధవారం నాడు గణపతిని పూజించి, దుర్గాదేవికి 16 శృంగార వస్తువులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కెరీర్‌లో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.
ఇది కూడా చదవండి: హెల్మెట్‌తో జుట్టు సమస్యలు.. కారణాలు తెలుసుకోండి
యాత్ర విజయవంతం కావడానికి: బుధవారం నాడు ఏదైనా ముఖ్యమైన పని మీద సుదూర ప్రయాణం చేయాల్సి వస్తే తంత్ర శాస్త్రం ప్రకారం.. బయలుదేరే ముందు ఒక నిమ్మకాయను మీ వెంట తీసుకెళ్లండి. తిరిగి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయను ప్రవహించే నీటిలో వదిలివేయండి. ఇలా చేయడం వల్ల యాత్ర విజయవంతమవుతుందని నమ్మకం. శత్రు బాధలు తొలగిపోవడానికి: స్కంద పురాణం ప్రకారం.. మీ పనులకు తరచుగా ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తున్నా, లేదా పనులు పూర్తవ్వకముందే చెడిపోతున్నా, బుధవారం నాడు గణపతిని పూజించేటప్పుడు వక్రతుండాయ హుమ్ అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఆ తర్వాత హోమం నిర్వహించి.. మీ కోరికను చెప్పుకుంటూ కొబ్బరికాయను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అన్ని కష్టాలు దూరమవుతాయని ప్రతీతి.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: మోకాలి నొప్పితో ఇబ్బందిగా ఉందా..? ఉపశమనం పొందడానికి ఈ నివారణ ట్రై చేయండి
( maha-ganapati | ganapati-festivals | ganapati-patri-puja | Latest News)