Health Tips: నిద్రలో ఈ 6 లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నట్లే!

నిద్రే మనకు అతి పెద్ద అనారోగ్య సంకేతాలను ఇస్తుంది. వాటిల్లో బాత్రూమ్‌కు వెళ్లడం, పాదాలువాపు, వింత అసౌకర్యం, ఊపిరి ఆడకపోవడం, కండరాలలో దృఢత్వం లేకపోవటం, తలలో భారంగా, రోజంతా అలసిపోయి నీరసంగా అనిపిస్తే మూత్రపిండాల సమస్యకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

New Update

kidney: నేటి కాలంలో ఎప్పుడు ఎలాంటి ఆనారోగ్య సమస్యలు వస్తాయో గుర్తించటం చాలా కష్టం. ఎందుకంటే మంచిగా ఉన్నవాళ్లకు కూడా ఏదో ఒక్క సమస్య వస్తుంది. అయితే.. అలసిపోయిన రోజు తర్వాత మనమందరం రాత్రి పడుకొనేటప్పుడు, ప్రశాంతంగా నిద్రపోవాలని ఆశిస్తాము. కానీ నిద్రే మనకు అతి పెద్ద అనారోగ్య సంకేతాలను ఇస్తుంది. శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి నిశ్శబ్దంగా పనిచేసే మూత్రపిండాలు విఫలమవడం ప్రారంభిస్తాయి. దీని మొదటి సంకేతాలు రాత్రి సమయంలో కనిపిస్తాయి. రాత్రిపూట 6 లక్షణాలు కనిపిస్తే కిడ్నీ దెబ్బతిన్నదని అర్థం చేసుకోవాలి. నిద్రలో కనిపించే సంకేతాలను  ముందుగానే గమనించి.. వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే సమస్యలను బయట పడవచ్చు. ఆ లక్షణాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

6 లక్షణాలు ఉంటే కిడ్నీ సమస్య ఉన్నటే..

  • రాత్రిపూట తరచుగా బాత్రూమ్‌కు వెళ్లడం సాధారణం కాదు. ప్రతి రెండు-మూడు గంటలకు మూత్ర విసర్జన చేయడానికి లేస్తుంటే..మూత్రపిండాలు వాటి వడపోత శక్తిని కోల్పోతున్నాయని స్పష్టమైన సంకేతం కావచ్చు.
  • నిద్ర తర్వాత మేల్కొన్నప్పుడు పాదాలు వాపుగా ఉన్నట్లు గుర్తించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మూత్రపిండాలు నీటిని సరిగ్గా తొలగించలేనప్పుడు.. శరీరంలో, ముఖ్యంగా కాళ్ళలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
  • రాత్రిపూట పక్కలు మార్చుకుంటూ ఉంటే.. మేల్కొంటూ ఉంటే లేదా శరీరంలో వింత అసౌకర్యాన్ని అనుభవిస్తే.. అది మూత్రపిండాలకు సంబంధించిన నరాలలో సమస్యకు సంకేతం కావచ్చు.
  • మూత్రపిండాలు విఫలమైనప్పుడు.. శరీరంలో ద్రవం పేరుకుపోతుంది ఇది ఊపిరితిత్తులను చేరుతుంది. నిద్రలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు ఊపిరి ఆడకపోవడం ఒక హెచ్చరిక సంకేతం.
  • నిద్రపోతున్నప్పుడు కండరాలలో దృఢత్వం లేదా ఆకస్మిక కుదుపులు కేవలం అలసట వల్ల కాకపోవచ్చు. ఇది కాల్షియం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు సంకేతం కావచ్చు. ఇది మూత్రపిండాల వైఫల్యం వల్ల వస్తుంది.
  • రాత్రి పూర్తిగా నిద్రపోయిన తర్వాత కూడా.. ఉదయం నిద్ర లేవగానే తలలో భారంగా, రోజంతా అలసిపోయి నీరసంగా అనిపిస్తే మూత్రపిండాలు శరీరం నుండి విషాన్ని తొలగించ లేకపోతున్నాయనడానికి ఇది సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: లివర్-కిడ్నీకి మేలు చేసి ఆరు పండ్లు.. ఇలా వాటిని తీసుకోండి

( kidneys | health-kidneys | health-benefits-for-kidneys | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news )

ఇది కూడా చదవండి: 
శరీరంలో అలసట ఉంటే రోజూ వీటిని తినండి


Advertisment
Advertisment
తాజా కథనాలు