Health Tips: ఇలా చేస్తే మలబద్ధకం మటుమాయం.. కడుపుకు ఉపశమనం..!

కివి పండు మలాన్ని వాల్యూమ్, నీటి శాతం పెంచుతుంది. ఇది ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. కివి పండు ఫైబర్‌కు మంచి వనరు. కివి పండును తీసుకోవడం, మినరల్స్ అధికంగా ఉన్న నీరు తాగడం, రై బ్రెడ్ తినడం దీర్ఘకాలిక మలబద్ధకాన్ని మెరుగుపరుస్తుంది.

New Update
Chronic Constipation and kiwi

Chronic Constipation and kiwi

నేటి వేగవంతమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కడుపు సమస్యలు సర్వసాధారణమయ్యాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక మలబద్ధకం (Chronic Constipation), కడుపు ఉబ్బరం (Bloating) వంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. సరైన మొత్తంలో నీరు, ఫైబర్ తీసుకుంటున్నా ఉపశమనం లభించని వారికి కివి పండు ఒక అద్భుత పరిష్కారంగా నిలుస్తుందిని ఓ నివేదికలో వెల్లడించారు. రోజుకు ఒకటి నుంచి రెండు కివి పండ్లను తినడం ఆరోగ్యానికి, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలిక మలబద్ధకానికి కివి పండు ఎలా పరిష్కారం చూపిస్తుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

కివి పండు జీర్ణక్రియ ప్రయోజనాలు:

అధ్యయనం ప్రకారం.. కివి పండు మలాన్ని వాల్యూమ్, నీటి శాతం పెంచుతుంది. ఇది ప్రేగుల కదలికలను (Intestinal Contractions) మెరుగుపరుస్తుంది. కివి పండును తొక్కతో సహా తినవచ్చు. ఇది ఫైబర్‌కు మంచి వనరు. కివి పండును తీసుకోవడం, మినరల్స్ అధికంగా ఉన్న నీరు తాగడం, రై బ్రెడ్ (Rye Bread) తినడం దీర్ఘకాలిక మలబద్ధకాన్ని మెరుగుపరుస్తుందని కనుగొన్నారు. పరిశోధన ప్రకారం.. కివి పండులో కరిగే (Soluble), కరగని (Insoluble) ఫైబర్‌లు రెండూ ఉన్నాయి. కరిగే ఫైబర్ మలాన్ని మృదువుగా చేస్తుంది. కరగని ఫైబర్ ప్రేగుల కదలికలను ప్రోత్సహిస్తుంది. యాక్టినిడిన్ (Actinidin) అనే ప్రత్యేక జీర్ణ ఎంజైమ్ కివిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఒమేగా ఆయిల్స్ ఉండే ఈ గింజలు ఎప్పుడు తినాలో ఇప్పుడే తెలుసుకోండి!!

ఇది ప్రోటీన్‌లను జీర్ణం చేయడంలో సహాయపడి.. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ప్రేగుల క్రమబద్ధతకు కివి పండు శక్తివంతమైన ఎంపిక. కివి పండులో విటమిన్ C కూడా పుష్కలంగా ఉంటుంది. రోజూ కివిని తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతూనే.. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పరిశోధన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని, మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో ఒకటి లేదా రెండు కివి పండ్లను చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అమర ఫలం.. చూస్తే టమాటా అనుకుంటారు కానీ.. అంతకు మించిన ప్రయోజనాలు అందిస్తుంది మరి!!

Advertisment
తాజా కథనాలు