Persimmon Fruit: అమర ఫలం.. చూస్తే టమాటా అనుకుంటారు కానీ.. అంతకు మించిన ప్రయోజనాలు అందిస్తుంది మరి!!

అమరఫలంలో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అమరఫలంలో విటమిన్ A కంటి చూపును మెరుగుపరచడంలో, కంటి పొడిబారడం, వయసు సంబంధిత సమస్యల నుంచి కళ్ళను రక్షిస్తుంది. చలికాలంలో వచ్చే జలుబు, వైరల్ ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి రోగనిరోధక శక్తి బలంగా ఉంచుతుంది.

New Update
Persimmon fruit

Persimmon Fruit

చలికాలం మొదలవ్వగానే మార్కెట్లలో రకరకాల కాలానుగుణ పండ్లు లభ్యమవుతాయి. వాటిలో ఒకటి అమర ఫలం (Amar Fruit). దీన్నే ఇంగ్లీష్‌లో పెర్సిమన్ (Persimmon) అని పిలుస్తారు. కొన్ని చోట్ల దీనిని జపనీస్ ఫ్రూట్ లేదా చైనీస్ యాపిల్ అని కూడా అంటారు. బయట ఆరెంజ్ రంగులో. లోపల తియ్యగా, పుల్లగా, మృదువుగా ఉండే ఈ పండును ఆరోగ్య నిపుణులు శీతాకాలపు సూపర్‌ఫుడ్‌గా అభివర్ణిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఈ పండును చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని డైటీషియన్ నిపుణులు చెబుతున్నారు.  అమర ఫలం తింటే ఎలాంటి అద్భుత ప్రయోజనాలు ఉన్నాయో వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

అమర ఫలం ప్రయోజనాలు:

ఈ పండులో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అమర ఫలంలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో, కంటి పొడిబారడం (dryness), వయసు సంబంధిత సమస్యల నుంచి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ లేదా మొబైల్ ముందు ఎక్కువ సమయం గడిపేవారికి ఇది చాలా మంచిది. చలికాలంలో వచ్చే జలుబు, వైరల్ ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ఈ పండులో ఉండే విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే అమర ఫలం కడుపును శుభ్రంగా ఉంచి.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే ఫైబర్ కారణంగా ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలిగి, అతిగా తినకుండా బరువు అదుపులో ఉంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఏ రంగు గుడ్డులో బలం ఎక్కువ..? తెలుపా లేక గోధుమ!!

ఈ పండులో ఉండే కొన్ని సమ్మేళనాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గి రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. విటమిన్లు A, C, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల అమర ఫలం యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించి, ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.  డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం అమర ఫలాన్ని ముక్కలుగా కోసుకుని తినవచ్చు. లేదా సలాడ్‌లలో, స్మూతీలలో కలిపి తీసుకోవచ్చు. దీని తీపి, పులుపు కలగలిసిన రుచి పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. కాబట్టి ఈ శీతాకాలపు సూపర్‌ఫుడ్‌ను రోజువారీ ఆహారంలో తప్పక చేర్చుకోండని నిపుణులు సలహా ఇస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మజ్జిగ తాగితే కడుపు శుభ్రం..? నిజమో కాదో తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు