/rtv/media/media_files/2025/10/07/cancer-health-tips-2025-10-07-08-59-31.jpg)
kidney Health Tips
మనిషి శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. వ్యర్థాలను తొలగించడం, శరీర ద్రవ సమతుల్యతను కాపాడటం, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి ముఖ్యమైన విధులను ఇవి నిర్వహిస్తాయి. జీవనశైలికి సంబంధించిన చిన్న, పెద్ద అంశాలు కిడ్నీ ఆరోగ్యాన్ని(kidney-health) ప్రభావితం చేస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే.. కిడ్నీ దెబ్బతిన్నప్పుడు కనిపించే లక్షణాలను ముందుగా గుర్తించడం చాలా అవసరం. కిడ్నీలలో ఉండే నెఫ్రాన్స్ (Nephrons) అనే చిన్న ఫిల్టరింగ్ యూనిట్లు సరిగ్గా పనిచేయడం ఆగిపోయినప్పుడు కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. దీనిని వైద్య పరిభాషలో నెఫ్రోసిస్ (Nephrosis) అంటారు. ఇది వ్యాధి కాకపోయినా.. సకాలంలో చికిత్స చేయకపోతే తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రపిండాల వైఫల్యాన్ని ముందుగానే గుర్తించవచ్చు. రాత్రి పడుకున్న వెంటనే కొన్ని లక్షణాలను గమనిచాలని. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ప్రారంభ సంకేతాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మూత్రంలో అధిక ప్రోటీన్ (నురుగు):ఇది అత్యంత ముఖ్యమైన లక్షణం. మూత్రవిసర్జన సమయంలో సాధారణం కంటే ఎక్కువ ప్రోటీన్ విడుదలవడం వల్ల మూత్రం నురుగుగా (Foamy) కనిపిస్తుంది.
రక్తంలో ప్రోటీన్ తగ్గడం: మూత్రంలో అధిక ప్రోటీన్ కోల్పోవడం వల్ల రక్తంలో ప్రోటీన్ పరిమాణం తగ్గిపోతుంది.
అలసట, బలహీనత: శరీరంలో తగినంత శక్తి, ప్రోటీన్ లేకపోవడం వల్ల తీవ్రమైన అలసట, బలహీనత కలుగుతాయి.
ఇది కూడా చదవండి: ఉదయం ఖాళీ కడుపుతో ఏం తింటే మంచిదో తెలుసా...?
వాపు, ఆకలి లేకపోవడం: కాళ్లు, ముఖం వాపుకు గురవడం, ఆకలి మందగించడం కూడా దీని లక్షణాలే. వీటితో పాటు మూత్రవిసర్జన తగ్గడం, అధిక రక్తపోటు (Blood Pressure) పెరగడం, కొన్ని సందర్భాల్లో మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ సమస్యలలో ఏది కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఖరీదైన ఫేషియల్స్‌తో పనిలేదు..ఇంట్లోనే ముఖం మెరిపించే సులభ చిట్కాలు