Health Tips: రాగి పాత్రలు, నల్ల జుట్టుకు సంబంధం ఏంటో తెలుసా..?

చెడు ఆహారపు అలవాట్లు.. ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు సహజ రంగు త్వరగా తగ్గిపోతోంది. రాగిపాత్రలో ఉంచిన నీటిని తాగడం జుట్టుకు చాలా మంచిది. రాగి శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
White hair

White hair

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వెంటాడుతున్న సమస్యల్లో తెల్లజుట్టు(white-hair) ఒకటి. చెడు ఆహారపు అలవాట్లు.. ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు సహజ రంగు త్వరగా తగ్గిపోతోంది. దీనికి పరిష్కారం కోసం కొందరు ఖరీదైన చికిత్సలు తీసుకుంటే.. మరికొందరు ఇంట్లో చిట్కాలు పాటిస్తున్నారు. అయితే రాగిపాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల కూడా తెల్లజుట్టు సమస్య తగ్గుతుందని ప్రముఖ పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

రాగిపాత్రలోని నీటితో తెల్లజుట్టుకు చెక్.. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాగిపాత్రలో ఉంచిన నీటిని తాగడం(drinking-water) జుట్టుకు చాలా మంచిది. రాగి శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. మెలనిన్ అనేది జుట్టుకు దాని సహజమైన నలుపు రంగును ఇచ్చే అంశం. శరీరంలో మెలనిన్ తక్కువగా ఉన్నప్పుడు జుట్టు తెల్లబడటం లేదా బూడిద రంగులోకి మారడం జరుగుతుంది. రాగి నీరు తాగడం వల్ల ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది, తెల్లజుట్టు నల్లబడటానికి సహాయపడుతుంది. రాగిపాత్రలో రాత్రంతా నీటిని ఉంచి.. ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. దీంతోపాటు ప్రతిరోజూ ఉదయం చెంచా నల్ల నువ్వులు తినడం కూడా మెలనిన్ స్థాయిని పెంచి.. జుట్టు నెరవడాన్ని తగ్గిస్తుంది. మెంతులు, ఉసిరి వాడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నానబెట్టిన మెంతులను, ఉసిరి గుజ్జుతో కలిపి రుబ్బుకుని.. షాంపూ చేయడానికి ముందు వారానికి ఒకసారి జుట్టుకు అప్లై చేయాలి. మెంతులు స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఉసిరి జుట్టు మూలాలను బలపరుస్తుంది. 

ఇది కూడా చదవండి: బ్లాక్ హెడ్స్ మీ ముఖం అందాన్ని తగ్గిస్తున్నాయా..? అయితే వైద్యులు సూచించే ఈ ఇంటి చిట్కా ట్రై చేయండి!!

అంతేకాకుండా రోజ్మేరీ ఆయిల్‌ను నీటిలో కలిపి రాత్రిపూట స్కాల్ప్‌కు అప్లై చేయాలి. ఇది స్కాల్ప్‌లో రక్త ప్రసరణను పెంచి.. కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. దీనిని వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు. ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను చేర్చాలి. చేపలు తినడం, ఒమేగా-3 సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా జుట్టు లోపలి నుంచి బలోపేతం అవుతుంది. అయితే కండీషనర్‌తో 1-2 పంపుల హెయిర్ సీరమ్‌ను కలిపి.. చేతుల్లో రుద్దుకుని.. జుట్టుకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడగాలి. ఇది జుట్టును మృదువుగా, సిల్కీగా మారుస్తుంది. జుట్టు సంరక్షణ కోసం ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదని.. ఇలాంటి చిన్న, నిలకడైన ప్రయత్నాలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: పాలల్లో ఇది కలుపుకొని తాగితే మంచి నిద్రొస్తుందని తెలుసా.?

Advertisment
తాజా కథనాలు