Better Sleep: పాలల్లో ఇది కలుపుకొని తాగితే మంచి నిద్రొస్తుందని తెలుసా.?

నిద్రలేమి సమస్యకు సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. నిద్ర సమస్యలు ఉన్నవారు.. పడుకునే ముందు ప్రత్యేకమైన స్లీప్ టానిక్ తాగవచ్చు. మంచినిద్ర కోసం.. మనస్సును ప్రశాంతంగా ఉండాలంటే ఈ ప్రత్యేక పానీయాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.

New Update
Better Sleep

Better Sleep

రాత్రిళ్లు నిద్ర పట్టక(Sleep Time) తరచుగా అటూ ఇటూ దొర్లుతూ ఉంటే.. మనస్సు అశాంతితో ఉండి నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమి సమస్యకు ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాలు ఉన్నాయని ఆయుర్వేద పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిద్ర సమస్యలు ఉన్నవారు.. పడుకునే ముందు ఒక ప్రత్యేకమైన స్లీప్ టానిక్ (Sleep Tonic) తయారు చేసుకుని తాగవచ్చు. మంచి నిద్ర కోసం.. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే ఈ ప్రత్యేక పానీయాన్ని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు, తయారీ విధానం, ఇది ఎలా పనిచేస్తుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

మంచి నిద్ర కోసం పాలల్లో ...

సోంపు గింజలు (Fennel Seeds) - 2 టీస్పూన్లు, బాదంపప్పులు (Almonds) - 4,  గసగసాలు (Poppy Seeds) - 1 టీస్పూన్, కలకండ (Rock Sugar) - 1/2 టీస్పూన్, యాలుక (Cardamom Pod) - 1, నల్ల మిరియాల పొడి (Black Pepper) - ఒక చిటికెడు, జాపత్రి (Nutmeg) - ఒక చిటికెడు, నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష (Black Raisins) - 4, కుంకుమపువ్వు (Saffron) - 3 పోగులు (Strands). అవసరం ఉంటుంది. పైన పేర్కొన్న అన్ని పదార్థాలను ఒక గ్రైండర్‌లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని శుభ్రమైన, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడి 2-3 వారాల వరకు తాజాగా ఉంటుంది. ప్రతి రాత్రి పడుకోవడానికి ముందు ఒక కప్పు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ ఈ పొడిని కలిపి, బాగా మిక్స్ చేసి, నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. మరింత మెరుగైన ఫలితాల కోసం.. ఇందులో ఒక చుక్క ఆవు నెయ్యి (Ghee) కూడా కలుపుకోవచ్చు.

 ఇది కూడా చదవండి: రాత్రి మధ్యలో నిద్ర లేస్తున్నారా..? కారణాలు, పరిష్కారాలు తెలుసుకోండి!!

ఇది శరీరంలోని వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ దోషాలు అధికంగా ఉన్నప్పుడు.. అవి అశాంతి, అతిగా ఆలోచించడం (Overthinking) నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తాయి. గసగసాలు, బాదంపప్పు, జాపత్రి నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి, మెదడును రిలాక్స్ చేస్తాయి, సోంపు, యాలుక, నల్ల మిరియాలు జీర్ణక్రియను బలోపేతం చేసి శరీరం సహజంగా గాఢ నిద్ర స్థితిలోకి వెళ్ళడానికి సహాయపడతాయి.  కుంకుమపువ్వు, ఎండు ద్రాక్ష శరీర శక్తిని (Ojas) పునరుద్ధరిస్తాయి.. తద్వారా ఉదయం మేల్కొన్న తర్వాత తాజాగా తేలికగా అనిపిస్తుంది. ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ పానీయాన్ని తాగడం వలన కొద్ది రోజుల్లోనే మార్పు గమనించవచ్చు. ఇది మంచి నిద్రకు సహాయపడటమే కాకుండా.. ఉదయం తేలికగా, ప్రశాంతంగా, ప్రశాంతమైన మనస్సుతో మేల్కొనేలా చేస్తుంది. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు ఈ చిట్కాను ప్రయత్నించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: వెండి పాదరక్షలు ఇంటి వద్దనే మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు.. ఎలానో తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు