/rtv/media/media_files/2025/10/24/blackheads-face-2025-10-24-07-22-33.jpg)
Face Blackheads
నేటి కాలంలో ముఖ సౌందర్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బ్లాక్‌హెడ్స్ ముఖ అందాన్ని పాడు చేస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవాటానికి ఎన్నో క్రీములు, బ్యూటీ వస్తువులు వాడుతూ ఉంటారు. ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తున్న మొండి బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి కొన్ని ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా ముక్కు, గడ్డం, నుదిటిపై కనిపించే ఈ నల్లటి మచ్చలు చాలా మందికి ఇబ్బందిగా మారుతున్నాయి. వాటిని తొలగించడానికి సూచించిన సులభమైన చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మొండి బ్లాక్‌హెడ్స్‌కు అద్భుతమైన ఇంటి చిట్కాలు:
బేకింగ్ సోడా: బేకింగ్ సోడాను సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో రెండు టీస్పూన్ల నీరు కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇది pH సమతుల్యతను సరిచేసి.. చనిపోయిన చర్మ కణాలను, ధూళిని తొలగిస్తుంది.
టొమాటో: విటమిన్ ఏ (A), సి (C) సమృద్ధిగా ఉండే టొమాటోలు జిడ్డు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఒక టొమాటోను గుండ్రని ముక్కలుగా కోసి, బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతాలలో రుద్దాలి. కాసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం వలన చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
ఇది కూడా చదవండి: పురుషులు Vs మహిళలు.. మాంసం ఎవరు ఎక్కువగా తింటారో తెలుసా..?
ఆవిరి పట్టడం (Steam): మొండి బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి ఆవిరి పట్టడం చాలా ప్రభావవంతమైన మార్గం. ఆవిరి చర్మాన్ని శుభ్రపరుస్తుంది, మూసుకుపోయిన రంధ్రాలను తెరుస్తుంది, తద్వారా ధూళి తొలగిపోతుంది. ఇది బ్లాక్‌హెడ్స్‌ను మృదువుగా చేసి.. సులభంగా తొలగించడానికి సహాయపడుతుంది.
నిమ్మ, తేనె, చక్కెర: రెండు టీస్పూన్ల తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ చక్కెరను బాగా కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. నిమ్మలోని సిట్రిక్ ఆమ్లం రంధ్రాలను తెరవడానికి.. తేనెలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు, చక్కెర స్క్రబ్‌గా పనిచేసి బ్లాక్‌హెడ్స్‌ను తొలగిస్తాయి. ఈ సహజమైన పరిష్కారాలను ప్రయత్నించి ముఖంపై మెరుపును తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చిట్కాలు సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తాయి. ఇంక ఏమైన సమస్య ఉన్నా, మరింత సమాచారం కోసం మంచి నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించటం ఉత్తమం.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వామ్మో ఖాళీ కడుపుతో ఫ్లాక్స్ సీడ్స్ నీరు తాగాలా..? ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!!
Follow Us