Health Tips: సండే అని చికెన్, మటన్ కుమ్మేస్తున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్!

ప్రపంచవ్యాప్తంగా ప్లానెటరీ హెల్త్ డైట్ పద్ధతిని పాటిస్తే అకాల మరణాలను నివారిస్తుంది. ఈ డైట్ ప్రధానంగా కూరగాయలు, పండ్లు, నట్స్, పప్పులు, తృణధాన్యాలు ఉంటాయి. అయితే ఇందులో మాంసం, గుడ్లు, పాలు వంటి కొన్ని జంతు ఉత్పత్తులను కూడా పరిమితంగా చేర్చుకోవచ్చు.

New Update
Planetary Health Diet

Planetary Health Diet

మారుతున్న జీవనశైలి(healthy life style), ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇటీవల విడుదలైన ఒక సంచలనాత్మక నివేదిక ప్లానెటరీ హెల్త్ డైట్ ఆవశ్యకతను నొక్కి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ఆహార పద్ధతిని పాటిస్తే.. ప్రతిరోజు సుమారు 40 వేల అకాల మరణాలను నివారించవచ్చని ఈ నివేదిక వెల్లడించింది. ఈ డైట్ ప్రధానంగా కూరగాయలు, పండ్లు, నట్స్, పప్పులు (Legumes), తృణధాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇందులో మాంసం, గుడ్లు, పాలు వంటి కొన్ని జంతు ఉత్పత్తులను కూడా పరిమితంగా చేర్చుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన, రుచికరమైన, వైవిధ్యభరితమైన ఆహారమని నిపుణులు పేర్కొన్నారు. ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేసే హెల్త్ డైట్స్‌ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఆరోగ్య.. పర్యావరణ ప్రయోజనాలు:

ఈ డైట్(human-life-style) పాటించడం ద్వారా ఏటా 15 మిలియన్ల అకాల మరణాలను నివారించవచ్చని నివేదిక సూచించింది. గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ప్రపంచ ఆహార వ్యవస్థ దాదాపు మూడింట ఒక వంతు గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తోంది. ఈ డైట్‌ను అవలంబిస్తే.. 2050 నాటికి ఆహార వ్యవస్థ వల్ల కలిగే వాతావరణ నష్టాన్ని సగానికి తగ్గించవచ్చు. ఆహార ఉత్పత్తి అనేది అడవుల విధ్వంసానికి, నీటి కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ప్రోటీన్ లోపాన్ని అధిగమించేందుకు సులభ మార్గాలు ఇవే

మాంసం ఆధారిత ఆహారాల అధిక వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని నివేదిక తెలిపింది. అమెరికా, కెనడా ప్రజలు ఈ డైట్ సిఫార్సు చేసిన దానికంటే ఏడు రెట్లు ఎక్కువ రెడ్ మీట్ తింటున్నారు. అయితే ప్రపంచంలోని సంపన్న వర్గాల (30%) ప్రజలే ఆహార ఉత్పత్తి ద్వారా పర్యావరణానికి కలిగే నష్టంలో 70% కంటే ఎక్కువ బాధ్యత వహిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. పోషకాహార లోపం, ఊబకాయం వంటి సమస్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటు ధరల్లో ఉంచి, అనారోగ్యకరమైన ఆహార ప్రకటనలను నియంత్రించడం, వ్యవసాయ రాయితీలను ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్లించడం వంటి చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. ఆహార వ్యర్థాలను తగ్గించడం, హరిత వ్యవసాయ పద్ధతులను పాటించడం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: పసుపు కాలేయానికి హాని కలిగిస్తుందా..? వైద్యులు చెప్పిన ఈ విషయాలు తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు