/rtv/media/media_files/2025/05/23/AnlX30qyozlQqomc8IVB.jpg)
Black Grapes
Black Grapes: నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, కె వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నల్ల ద్రాక్ష ఏ వ్యాధిని తగ్గిస్తుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Also Read : కవిత లేఖ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీనా?
మెదడు పనితీరు అధికం:
ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నల్ల ద్రాక్షలోని రెస్వెరాట్రాల్ మెదడు పనితీరును పెంచుతుంది, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: పాలు మాత్రమే కాదు.. ఈ ఆహారం కూడా మీ ఎముకలను స్ట్రాంగ్ చేస్తాయ్!
క్రమం తప్పకుండా నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ద్రాక్షలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బరువు తగ్గటానికి, క్యాన్సర ప్రమాదాన్ని, అధిక రక్తపోటు, కంటి, జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నేటికాలంలో అధిక బరువుతో కొందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు రోజూ ఆహారంలో ద్రాక్షను చేర్చుకుంటే బరువు తగ్గుతారు. అంతేకాకుండ నల్ల ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read : ఎంతకు తెగించార్రా.. 12 ఏళ్ల దళిత బాలికపై ఐదుగురు మైనర్లు అత్యాచారం !
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: దోసకాయతో ఈ వస్తువులను అసలు తినవద్దు.. చాలా డేంజర్ బాబోయ్!
black-grapes | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news