/rtv/media/media_files/2025/10/16/dates-2025-10-16-19-33-17.jpg)
Dates
ఖర్జూరాన్ని (Dates) ఊరికే సహజ ఆరోగ్య బూస్టర్ అనలేదు. రోజువారీ దినచర్యలో కేవలం 2-3 ఖర్జూరాలను చేర్చుకోవడం వలన ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ డ్రై ఫ్రూట్ పీచుపదార్థం (Fiber), పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్లతో నిండి ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే 2 ఖర్జూరాలు తినటం వల్ల కలిగే లాభాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మీరు బలహీనమైన ఎముకల సమస్యతో బాధపడుతుంటే.. ఖర్జూరాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఖర్జూరాలలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, బోలు ఎముకల వ్యాధి (Osteoporosis) వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఖర్జూరాలలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఉదయం వీటిని తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: కుడి లేదా ఎడమ.. మీరు ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసా..?
ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఖర్జూరాలలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి, కాంతివంతమైన చర్మాన్ని అందిస్తాయి. అయితే ఉదయం ఖాళీ కడుపుతో 2-3 ఖర్జూరాలను నేరుగా తినవచ్చు. వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం తినవచ్చు. లేదా వాటిని పాలల్లో నానబెట్టి తీసుకోవడం కూడా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. రోజువారీ అలవాట్లలో ఈ చిన్న మార్పును చేసుకోవడం ద్వారా ఆరోగ్యంలో గొప్ప సానుకూల మార్పులను అనుభూతి చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పిల్లల చర్మం ఎంతో సున్నితం.. ఈ 3 వస్తువులు ఉంచండి వారికి దూరం!