Child Care: పిల్లల చర్మం ఎంతో సున్నితం.. ఈ 3 వస్తువులు ఉంచండి వారికి దూరం!

చిన్న పిల్లలకు వేడి దద్దుర్లు, సెగ గడ్డలు, చర్మ అలెర్జీల ఉపశమనం కోసం వివిధ రకాల చర్మ ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. కొన్ని ఉత్పత్తులు మేలుకు బదులు హాని కలిగిస్తాయి. వాటిల్లో టాల్కమ్ పౌడర్, యాంటీ బాక్టీరియల్ సబ్బు, సువాసన ఉన్న ఉత్పత్తులను దూరంగా ఉంచాలి.

New Update
Child Care

Child Care

వేడిగా ఉంటే చిన్న పిల్లలకు అంత కష్టంగా మారుతుంది. సీజన్‌లో వారికి వేడి దద్దుర్లు (Heat Rash), సెగ గడ్డలు (Prickly Heat), చర్మ అలెర్జీలు సాధారణం అవుతాయి. ఉపశమనం కోసం తల్లిదండ్రులు వివిధ రకాల చర్మ ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. అయితే కొన్ని ఉత్పత్తులు మేలుకు బదులు హాని కలిగిస్తాయి. చర్మ వైద్యులు (Dermatologists) చెబుతున్న దాని ప్రకారం.. పిల్లల చర్మం చాలా సున్నితంగా, మృదువుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చిన్న పొరపాటు లేదా తప్పుడు చర్మ ఉత్పత్తుల వాడకం వారి చర్మంపైనే కాక, ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిపుణులు హెచ్చరిస్తున్న సాధారణ ఉత్పత్తులు ఏంటో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

సున్నితమైన చర్మానికి జాగ్రత్త.. 

టాల్కమ్ పౌడర్ (Talcum Powder):

ఈ జాబితాలో మొదటిది టాల్కమ్ పౌడర్. వేడి దద్దుర్లను తగ్గించడానికి లేదా చర్మాన్ని చల్లబరచడానికి చాలా మంది తల్లిదండ్రులు దీన్ని వాడుతారు. అయితే చర్మ వైద్యులు టాల్కమ్ పౌడర్ చాలా హానికరం అని హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టాల్కమ్ పౌడర్‌లో ఉండే అత్యంత సూక్ష్మ కణాలు (Fine Particles) పిల్లలు శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తులలోకి చేరి.. తీవ్రమైన హాని కలిగించవచ్చని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: దీపావళి తర్వాత వృశ్చిక రాశిలోకి బుధుడు.. ఈ 9 రాశుల వారికి ఇక తిరుగుండదు!

యాంటీ బాక్టీరియల్ సబ్బు (Antibacterial Soap):

చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం యాంటీ బాక్టీరియల్ సబ్బును ఉపయోగించడానికి ఇష్టపడతారు. అయితే నిపుణులు దీనిని కూడా హానికరం అంటున్నారు. పిల్లల చర్మంపై సహజంగానే కొన్ని మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి చెడు బ్యాక్టీరియా నుంచి వారిని రక్షిస్తాయి. కానీ యాంటీ బాక్టీరియల్ సబ్బు మంచి, చెడు బ్యాక్టీరియాలను రెండింటినీ చంపేస్తుంది. కాబట్టి దీన్ని వాడటం నివారించాలని నిపుణులు చెబుతున్నారు.

సువాసన (Perfume) ఉన్న ఉత్పత్తులు:

చిన్న పిల్లలకు సువాసన ఉన్న (Perfumed) ఉత్పత్తులను వాడటం మానుకోవాలని చర్మ వైద్యులు సలహా ఇస్తున్నారు. వీటిలో ఉండే రసాయనాలు పిల్లల చర్మాన్ని చికాకు పెట్టవచ్చు, అలెర్జీ ప్రతిచర్యలు లేదా దద్దుర్లకు కారణం కావచ్చు. అందువల్ల పిల్లల కోసం ఎల్లప్పుడూ తేలికపాటి.. సువాసన లేని, చర్మ వైద్యులు సిఫార్సు చేసిన ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: థ్రెడింగ్ ఇంకా వాక్సింగ్ మధ్య ఎంతో తేడా ఉంది.. అదేంటో మీరూ తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు