Sleeping Tips: కుడి లేదా ఎడమ.. మీరు ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిదో తెలుసా..?

సరైన నిద్ర లేకపోతే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటంతోపాటు డయాబెటిస్, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. త్వరగా, ఆరోగ్యంగా నిద్ర పోవడానికి ఎడమ వైపు పడుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Sleeping

Sleeping

నేటి వేగవంతమైన జీవితంలో చాలా మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. మంచి ఆరోగ్యం కోసం తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన నిద్ర లేకపోతే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటంతోపాటు డయాబెటిస్, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టని వారు.. ఏ వైపు పడుకుంటే త్వరగా నిద్ర వస్తుందో తెలుసుకోవడం అవసరం. వేగంగా నిద్ర పట్టడానికి ఏ వైపు పడుకోవాలి..? ఆరోగ్యకరమైన నిద్రకు పరిష్కారం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

నిద్రకు ఉత్తమమైన స్థానం:

ఎడమ వైపు పడుకోవడం (Left Side): సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఎడమ వైపు పడుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం.. ఈ భంగిమలో పడుకోవడం వల్ల కడుపు, పేగులపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా జీర్ణక్రియ సులభమవుతుంది. సరైన జీర్ణక్రియ కారణంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉండవు.. ఇది మనసును తాజాగా ఉంచి త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఎడమ వైపు పడుకోవడం క్రమబద్ధమైన గుండె లయను (regular heartbeat) నిర్వహిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఈ భంగిమ వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది.

ఇది కూడా చదవండి: శిక్షించకుండా ఇలా సరిదిద్దండి.. పిల్లలను పెంచడంలో అసలు రహస్యాలు ఇవే!!

కుడి వైపు పడుకోవడం (Right Side): గుండె జబ్బులు (Heart Disease) ఉన్నవారు కుడి వైపు పడుకోవడం మంచిది.  నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండె వైఫల్యం (heart failure) ఉన్న రోగులకు ఈ స్థానం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులపై ఒత్తిడిని తగ్గించి.. శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వెల్లకిలా పడుకోవడం (On the Back): వెల్లకిలా పడుకోవడం వెన్నెముకకు మద్దతునిస్తుంది (spinal support), సమతుల్యతకు మంచిది. అయితే ఈ స్థానం స్లీప్ అప్నియా, గురక సమస్యలు ఉన్నవారికి హానికరం. సరైన నిద్ర ఆరోగ్యానికి చాలా కీలకం. త్వరగా, ఆరోగ్యంగా నిద్ర పోవడానికి ఎడమ వైపు పడుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అందమైన మెరిసే చర్మం కోసం అచ్చంగా 6 చిట్కాలు

Advertisment
తాజా కథనాలు