Raw Almond: పొట్టు బాదం సురక్షితమేనా..? నిపుణుల సలహాలు కూడా తెలుసుకోండి!!

బాదం గింజలను నానబెట్టి, పొట్టు తీసి తినాలంటారు. అయితే నానబెట్టడం వల్ల పోషక విలువల్లో పెద్దగా మార్పు ఉండదు. బాదం పొట్టులో లెక్టిన్ వాపును పెంచుతుంది. అందువల్ల బాదం గింజలను నానబెట్టి పొట్టు తీసి కొద్దిగా వేయించి తినడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

New Update
Raw Almond

Raw Almond

రోజువారీ ఆహారంలో బాదం గింజలు చేర్చుకోవాలని చెబుతుంటారు. ఇవి మనల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే బాదం గింజలను పచ్చిగా తినడం లేదా వాటి పొట్టుతో సహా తినడం సురక్షితమేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. బాదం గింజలు చాలా కాలంగా ఆహారంలో భాగంగా ఉన్నాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే పచ్చి బాదం తింటున్నట్లయితే.. దాని పొట్టులో ఉండే లెక్టిన్ అనే ఒక పదార్ధం కూడా మీ శరీరంలోకి వెళ్తుంది. లెక్టిన్ అనేది మొక్కలను కీటకాల నుంచి రక్షించే ఒక సహజ రక్షణ వ్యవస్థ. కొంతమందిలో ఇది జీర్ణ సమస్యలకు లేదా శరీరంలో వాపునకు కారణం కావచ్చు. ఈ అంశంపై ఒక పరిశీలన చేసి నిపుణుల అభిప్రాయాన్ని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

కొద్దిగా వేయించి తినడం మంచిదని..

బాదం గింజలను నానబెట్టి, పొట్టు తీసి తినాలని చాలామంది చెబుతుంటారు. దీనివల్ల అవి మెత్తగా మారి సులభంగా జీర్ణమవుతాయి. అయితే పరిశోధనల ప్రకారం.. నానబెట్టడం వల్ల పోషక విలువల్లో పెద్దగా మార్పు ఉండదు. బాదం పొట్టులో లెక్టిన్ ఉండవచ్చు.. ఇది వాపును పెంచుతుంది. అందువల్ల బాదం గింజలను నానబెట్టి పొట్టు తీసి కొద్దిగా వేయించి తినడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే.. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాదంలో లెక్టిన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇది కిడ్నీ బీన్స్ వంటి ప్రమాదకరమైన ఆహార పదార్థాల కంటే చాలా తక్కువ. 

ఇది కూడా చదవండి: ముఖంపై మచ్చలు అందాన్ని పాడు చేస్తున్నాయా..? ఈ ఇంటి చిట్కాలతో సమస్యలన్నీ పరార్..!!

సాధారణంగా ఆరోగ్యవంతులైన వ్యక్తులకు దీని వల్ల ఎలాంటి హాని ఉండదు. అనేక పరిశోధనలు లెక్టిన్ కలిగిన బీన్స్, ధాన్యాలు, గింజలు వంటి ఆహార పదార్థాలు వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. బాదంను నానబెట్టడం లేదా వేయించడం వల్ల లెక్టిన్ తగ్గినప్పటికీ పొట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్ కూడా పోతాయి. కాబట్టి చాలామందికి పొట్టుతో సహా పచ్చి బాదం తినడం సురక్షితం మరియు ప్రయోజనకరమే. మీకు జీర్ణ సమస్యలు ఉంటే.. నానబెట్టి, పొట్టు తీసి తినడం మంచిది. వేయించడం వల్ల రుచి మరియు జీర్ణశక్తి మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వయస్సు పెరిగినా అందంగా కనిపించాలనుకుంటున్నారా?.. అయితే ఈ సీక్రెట్ తెలుసుకోండి!

Advertisment
తాజా కథనాలు