Face Spots: ముఖంపై మచ్చలు అందాన్ని పాడు చేస్తున్నాయా..? ఈ ఇంటి చిట్కాలతో సమస్యలన్నీ పరార్..!!

మహిళలకు హార్మోన్ల మార్పులు, చర్మ ఇన్ఫెక్షన్ల వల్ల ముఖంపై నల్ల మచ్చలు, మచ్చలు వస్తాయి. ఇవి అందాన్ని పాడు చేస్తాయి. ఈ సమస్య తగ్గాలంటే నిమ్మరసం, దోసకాయ, పసుపు-పాలు, టమాటో రసం, అలోవెరా జెల్ వంటివి ముఖానికి రాస్తే నల్లమచ్చలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Face Spots

Face Spots

ముఖం మన వ్యక్తిత్వానికి అద్దం లాంటిది. ముఖం పరిశుభ్రంగా, ప్రకాశవంతంగా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే.. కాలుష్యం, ఎండ, సరైన ఆహారం లేకపోవడం, హార్మోన్ల మార్పులు, చర్మ ఇన్ఫెక్షన్ల వల్ల ముఖంపై నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, మచ్చలు వస్తాయి. ఇవి అందాన్ని పాడు చేయడమే కాకుండా తరచుగా మేకప్ సహాయం తీసుకోవలసి వస్తుంది. చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన ఇంటి చిట్కాలు మరియు కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ సమస్యలను పరిష్కరించవచ్చని చెబుతున్నారు. మచ్చలను తగ్గించి, సహజమైన మెరుపును తిరిగి తీసుకురావడానికి కొన్ని ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ అర్టికల్‌లో తెలుసుకుందాం.

నిమ్మరసం:

  • నిమ్మరసం చర్మానికి సహజమైన బ్లీచ్‌లా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ C చర్మానికి రంగును పెంచుతుంది, నల్ల మచ్చలను తగ్గిస్తుంది. ఒక చెంచా నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. క్రమం తప్పకుండా వాడటం వల్ల మచ్చలు క్రమంగా తగ్గుతాయి.

దోసకాయ:

  • దోసకాయ రసం ముఖానికి రాసుకోవడం వల్ల చర్మానికి చల్లదనం లభిస్తుంది మరియు టానింగ్ తగ్గుతుంది. దోసకాయను తురిమి రసం తీసి దాన్ని 15 నిమిషాల పాటు ముఖంపై ఉంచుకోవాలి. ఈ చిట్కా ప్రభావవంతంగా పనిచేస్తుంది మరియు మచ్చలను తగ్గిస్తుంది.

పసుపు-పాలు:

  • పసుపులో యాంటీసెప్టిక్ మరియు యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పాలు చర్మానికి తేమను అందిస్తాయి. ఒక చెంచా పసుపులో పచ్చి పాలు కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్‌ను 15 నిమిషాల పాటు ముఖానికి రాసుకుని.. ఆ తర్వాత కడిగేయాలి. ఇది మచ్చలను తగ్గించడమే కాకుండా.. ముఖానికి సహజమైన మెరుపును కూడా ఇస్తుంది.

టమాటో రసం:

  • టమాటోలో ఉండే లైకోపీన్ చర్మాన్ని టానింగ్ మరియు నల్ల మచ్చల నుంచి రక్షిస్తుంది. ఒక టమాటో రసం తీసి అందులో కొద్దిగా పెరుగు కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. క్రమం తప్పకుండా వాడటం వల్ల పిగ్మెంటేషన్ మరియు నల్ల మచ్చలు తగ్గుతాయి.

ఇది కూడా చదవండి: ఈ మూడు పదార్థాలను పెరుగుతో కలిపి తింటే డేంజర్.. షాకింగ్ విషయాలు!

అలోవెరా జెల్:

  • అలోవెరాలో ఉండే గుణాలు చర్మం లోపల వెళ్లి హీలింగ్ పని చేస్తాయి. రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్‌ను ముఖంపై బాగా రాసుకుని, రాత్రంతా ఉంచుకోవాలి. ఉదయం లేచిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇది చర్మానికి తేమను అందించడంతో పాటు మచ్చలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మంచి నిద్ర:

  • ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజూ 8 నుంచి 9 గంటలు నిద్ర పోవాలి. మంచి నిద్ర వల్ల చర్మం రంగు మారుతుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా ముఖ్యం. అంతేకాకుండా నిద్ర అనేక వ్యాధులను నుంచి కాపాడుతుంది.  వీటితోపాటు సరైనా ఆహారం తీసుకున్నా ఆరోగ్యానికి, చర్మానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మీరు మరింత అందంగా కనిపించాలనుకుంటున్నారా..? అయితే ప్రతీ ఉదయం ఇలా చేయండి!

Advertisment
తాజా కథనాలు