Papaya: పండు ఒకటే కానీ ప్రయోజనాలు నాలుగు

బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణ ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి. దీనిని తినడం వల్ల చర్మం కాంతివంతమవడమే కాక.. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బొప్పాయి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Papaya

Papaya

నేటి కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పండ్లు, కూరగాయలు, గింజలు, గ్రీన్ టీ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. విటమిన్ సి (Vitamin C), యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఒక అద్భుతమైన పండు. దీనిని సూపర్‌ఫుడ్ (Superfood) అని కూడా పిలవవచ్చు. అది మనకు సులభంగా, చవకగా లభించే బొప్పాయి (Papaya). తీపిగా, రుచికరంగా ఉండే బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణ ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి. దీనిని తినడం వల్ల చర్మం కాంతివంతమవడమే కాక.. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.  బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి  బొప్పాయి ఎలా తినాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు:

బరువు తగ్గడంలో సహాయం: బొప్పాయిలో కేలరీలు తక్కువగా, పీచు (Fiber) ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి అతిగా తినకుండా నిరోధించవచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

గుండె, రక్తంలో చక్కెర నియంత్రణ: బొప్పాయిలో ఉండే పొటాషియం (Potassium) రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అంతేకాక బొప్పాయికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low Glycemic Index) ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారు కూడా దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు.

ఇది కూడా చదవండి: గర్భధారణ నివారణకు మాత్రలు మింగుతున్నారా..? అయితే గుండెపోటు ఖాయం!!

జీర్ణక్రియ మెరుగు: బొప్పాయిలో ఉండే పాపైన్ (Papain) అనే ఎంజైమ్ ఆహారాన్ని త్వరగా.. సరిగ్గా జీర్ణం చేయడంలో తోడ్పడుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు ఉపశమనం ఇచ్చి రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది.

చర్మ కాంతి: విటమిన్ సి, లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా బొప్పాయి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, యవ్వనంగా ఉండి ముడతలు తగ్గుతాయి. ఉదయం అల్పాహారంలో తాజా బొప్పాయి ముక్కలను తినవచ్చు. నిమ్మరసం పిండుకుని లేదా స్మూతీలు, సలాడ్‌లలో కలుపుకుని తింటే రుచి, ఆరోగ్యం రెండూ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: పేరుకే అల్పాహారం.. కానీ కడుపు నిండుగా ఉంచుతాయని తెలుసా..?

Advertisment
తాజా కథనాలు