/rtv/media/media_files/2025/09/30/stroke-risk-2025-09-30-18-31-46.jpg)
Stroke Risk
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిన్‌తో కూడిన హార్మోన్ల గర్భనిరోధక మాత్రలను (CHCs) ఉపయోగిస్తున్నారు. ఇవి గర్భధారణను నివారించడమే కాక.. రుతు చక్రాలను నియంత్రించడానికి కూడా ఉపయోగపడతాయి. అయితే తాజా పరిశోధన ప్రకారం.. ఈ గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ది కన్వర్జేషన్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా అకస్మాత్తుగా వచ్చే క్రిప్టోజెనిక్ ఇస్కీమిక్ స్ట్రోక్ ముప్పును ఈ అధ్యయనం హైలైట్ చేసింది. యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ సమావేశంలో సమర్పించిన SECRETO అధ్యయన ఫలితాల ప్రకారం.. ఈ హార్మోన్ల మాత్రలు ఉపయోగించే మహిళల్లో క్రిప్టోజెనిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం.. ఉపయోగించని వారితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఊబకాయం, మైగ్రేన్ వంటి ఇతర ప్రమాద కారకాలను పరిగణించిన తర్వాత కూడా ఈ రిస్క్ అలాగే ఉంది. మాత్రలతోపాటు ఈస్ట్రోజెన్ కలిగిన ప్యాచ్, వాజినల్ రింగ్ వంటి ఇతర పద్ధతుల్లో కూడా ఈ ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి.
స్ట్రోక్ ముప్పు ఎక్కువ..
అయితే ప్రొజెస్టిన్-మాత్రమే కలిగిన IUDలలో మాత్రం అదనపు ప్రమాదం కనిపించలేదు. కృత్రిమ ఈస్ట్రోజెన్ ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి కాలేయాన్ని ప్రేరేపిస్తుంది, గడ్డలు ఏర్పడకుండా నిరోధించే వాటి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఈ గడ్డలు మెదడులోని ధమనులను అడ్డుకుని ఇస్కీమిక్ స్ట్రోక్‌కు కారణమవుతాయి. ధూమపానం చేసేవారికి.. మైగ్రేన్‌తో బాధపడేవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఉన్నప్పటికీ సంపూర్ణ ప్రమాదం తక్కువగానే ఉంది. ప్రతి 4,700 మంది మాత్రలు వాడేవారిలో సంవత్సరానికి సుమారు ఒక్కరికి మాత్రమే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: నల్లగా మారుతున్న చేతులను నార్మల్ రంగులోకి తెచ్చుకోవడానికి చిట్కాలు
అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు CHCలను ఉపయోగిస్తున్నందున.. చిన్న ప్రమాదం కూడా జనాభా స్థాయిలో పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. గర్భధారణ సమయంలో ప్రసవానంతర కాలంలో స్ట్రోక్ ప్రమాదం, గర్భనిరోధక మందుల కంటే ఎక్కువగా ఉంటుందనే విషయం ఇక్కడ గమనించాలి. గర్భనిరోధక మందుల దుష్ప్రభావాలపై సరైన అధ్యయనం లేకపోవడం మహిళల ఆరోగ్య వనరులలో ప్రధాన లోపాన్ని తెలియజేస్తుంది. మహిళలు సురక్షితమైన, ప్రభావవంతమైన పద్ధతిని ఎంచుకోవడానికి వారికి పారదర్శకమైన సమాచారం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కుక్క కరిస్తేనే కాదు ఈ జంతువులు కరిచిన రెబిస్ వస్తుంది.. తెలుసుకొని జాగ్రత్త పడండి