/rtv/media/media_files/2025/05/03/wDKwuGh133RonLgCIf9N.jpg)
Tomato Terra Festival
పండుగ అంటే అందరికీ ఆనందంగానే ఉంటుంది. అయితే కొన్ని పండుగలు బంధువులతో చేసుకుంటే మరికొన్ని కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునేవి ఉంటాయి. కానీ ఈ పండుగ మాత్రం స్నేహితులతో చేసుకుంటే సరదాగా ఉంటుంది. అలాంటి సరదా పండుగకు హైదరాబాద్ వేదిక కానుంది. అదేంటో తెలుసా టమా ఫైట్ ఫెస్టివల్, హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా టమాటా ఫైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ వేడుక మే 11న ఉదయం 10 గంటలకు మొదలు అవుతుంది. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సుమారు 25 వేల జాతుల అరుదైన వృక్షాలు, మొక్కలు, శిల్పాలతో కూడిన ‘ఎక్స్‌పీరియం’ ఎకో పార్క్ దీనికి వేదిక కానుంది.
Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
Telangana Tomato Terra Festival
స్పెయిన్‌లోని ప్రసిద్ధ లాటమాటినా పండుగనుండి ప్రేరణ పొందిన టమాట ఫైట్ ఫెస్టివల్ ను చాలా దేశాల్లో నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం తొలిసారి ఈ ఉత్సాహానికి వేదిక కానుండటం విశేషం. హైదరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైన.. ఉల్లాసభరితమైన టమాటా ఫైట్ ఫెస్టివల్ జరగబోతోంది. వేల కిలోల టమాటాలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆనందించడమే ఈ ఫెస్టివల్ ప్రత్యేకత.
Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
'ఎక్స్‌పీరియం' ఎకో పార్క్‌లో టమాటా ఫైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఎకో పార్క్ కు కూడా అనేక ప్రత్యేకతలున్నాయి. 85 దేశాల నుండి దిగుమతి చేసుకున్న సుమారు 25 వేల జాతుల అరుదైన వృక్షాలు, మొక్కలు, అద్భుతమైన శిల్పాలు ఈ పార్క్‌లో కొలువు తీరాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరు వద్ద ప్రముఖ వ్యాపారవేత్త రాందేవ్ రావు ఆరున్నరేళ్ల సుదీర్ఘ శ్రమతో 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ విశాలమైన ఎకో పార్క్‌ను తీర్చిదిద్దారు. దేశంలోనే అతి పెద్దదిగా పేరుగాంచిన ఈ ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు.
Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
ఈ పార్క్ ఇప్పుడు టమాట ఫైట్ ఫెస్టివల్‌కు వేదికగా మారింది. ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి ఈ ఫెస్టివల్ ఆరంభమవుతుంది. ఇక్కడ పాల్గొనేవారు వేల కిలోల టమాటాలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ తమ ఆనందంగా గడపచ్చు. ఈ వేడుకలో ప్రత్యేక లైవ్ డీజే సంగీతాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటికి తోడు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, రుచికరమైన ఆహారాన్ని అందించే ఫుడ్ స్టాల్స్‌తో పాటు.. షాపింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా మార్కెట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు వేర్వేరుగా ఆనందించేందుకు ప్రత్యేకమైన ఫన్ జోన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‌లో టెన్షన్ టెన్షన్..!
అయితే ఇదంతా ఉచితంగా మాత్రం కాదండోయ్. దీనికి టికెట్లు కూడా నిర్ణయించారు. టికెట్ల ధరలు రూ. 499 నుండి ప్రారంభమై రూ. 3,499 వరకు వివిధ కేటగిరీలలో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.ఇక పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ.. ఈ ఫెస్టివల్‌లో ఉపయోగించిన టమాటాలను వృథా చేయకుండా వాటిని ఎరువుగా మార్చి రైతులకు అందించనున్నారు. వేసవి తాపంతో అల్లాడుతున్న హైదరాబాదీలకు ఈ టమాటా ఫైట్ ఫెస్టివల్ ఒక సరికొత్త.. సరదా అనుభవాన్ని అందిస్తనడంలో సందేహం లేదు. స్నేహితులు,కుటుంబ సభ్యులతో కలిసి నవ్వులు, కేరింతల మధ్య గడిపేందుకు ఇది ఒక చక్కని అవకాశంగా మార్చుకోవచ్చు. మరింకేందుకు ఆలస్యం ఛలో ఎక్స్‌పీరియం ఎకో పార్క్.
Also Read: గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్కు మరో షాకిచ్చిన మోదీ!
Also Read: నేతలకూ తప్పని టార్చర్..బీజేపీ మహిళా మంత్రికి అసభ్యకరమైన కాల్స్, మెసేజెస్
rangareddy-district | park