/rtv/media/media_files/2025/05/03/8LltO1OEDqFcwXOMBCn7.jpg)
Woman Died After Eating Chicken Biryani
బిర్యానీ అనగానే అందరూ లొట్టలేసుకుని లాగించేస్తారు. అయితే బిర్యానీ ప్రియుల బలహీనతను ఆసరా చేసుకున్న కొన్ని రెస్టారెంట్లు కల్తీ నూనె, కల్తీ మసాలతో బిర్యానీ వండి వార్చుతున్నాయి. దీంతో అది తిన్నవారు ఆస్వస్థకు గురికావడం సర్వసాధారణమైంది. ఫుడ్ పాయిజన్ వల్ల ఇప్పటికే చాలా మంది అనారోగ్యాల భారిన పడుతున్నా.. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రం భోజనం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం శోచనీయం.హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో చికెన్ బిర్యానీ తిన్న భార్య మృతి చెందగా, భర్త తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
ఇది కూడా చదవండి: ఉదయం ఈ తప్పులు చేస్తే థైరాయిడ్ మందులు వేసుకున్నా లాభం ఉండదు
Woman Died After Eating Chicken Biryani
హైదరాబాద్ అనగానే బిర్యానీకి ఫేమస్.అదే బిర్యానీ చాలా మందికి చేదు అనుభవాలు మిగిల్చిన సందర్భాలూ ఉన్నాయి. అదే బిర్యానీ మనుషుల ప్రాణం తీస్తుందంటే నమ్ముతారా? కానీ అదే జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా రాజేశ్వరి అనే మహిళ మరణించగా, ఆమె భర్త రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాత్రిపూట ఎంతో సంతోషంగా.. బిర్యానీ తిన్న ఆ భార్యాభర్తల జీవితం కలలో కూడా ఊహించని మలుపు తీసుకుంది. అదే వాళ్లిద్దరు కలిసి చేసిన చివరి భోజనం అవుతుందని అస్సలు ఊహించలేకపోయారు ఆ దంపతులు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబోడ ప్రాంతంలో జరిగింది ఈ విషాదకర ఘటన. ఫుడ్ పాయిజన్ కారణంగా రాజేశ్వరి (38) అనే మహిళ మృతి చెందగా.. ఆమె భర్త రమేశ్ (48) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: తిరుపతిలో విషాదం.. దామల చెరువులో వ్యాపారి దారుణ హత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్ బాలానగర్‌లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం రమేశ్ బాలానగర్‌లోని ఓ రెస్టారెంట్ నుంచి చికెన్ బిర్యానీ ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి భార్యాభర్తలిద్దరూ కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఆ బిర్యానీని తిన్నారు. ఆ రోజు బాగానే ఉన్నా మరునాడు తెల్లవారుజాము నుంచి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరూ స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. అయితే.. గురువారం రోజున పరిస్థితి విషమించడంతో రాజేశ్వరి మృతి చెందారు. రమేష్ ఆరోగ్యం కూడా కుదుటపడకపోవటంతో.. కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన చికిత్స కోసం ఉప్పర్‌పల్లిలోని మరో ఆస్పత్రికి తరలించారు.
Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
ఈ ఘటనపై మృతురాలు రాజేశ్వరి అక్క.రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే తన సోదరి మృతి చెందిందని ఆమె ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న తర్వాత అస్వస్థతకు గురైన ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
husband | women dies | chicken-biryani | food poisioning