/rtv/media/media_files/2025/08/12/hair-2025-08-12-16-30-15.jpg)
Hair
జుట్టు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది వ్యక్తిత్వాన్ని, అందాన్ని ప్రతిబింబిస్తుంది. జుట్టు ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బలమైన, నిగనిగలాడే జుట్టు ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని సూచిస్తుంది. జుట్టు రాలడం(Hair Fall), చుండ్రు, జుట్టు పలచబడటం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి సరైన సంరక్షణ అవసరం. మంచి ఆహారం, శుభ్రత, సరైన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జుట్టు సంరక్షణ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాకుండా.. ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. శరీరంలోని అనేక అవయవాలు ఏదైనా వ్యాధి బారిన పడటానికి ముందు లేదా ఆ సమయంలో సంకేతాలు ఇస్తుంటాయి. కానీ మన జుట్టు కూడా మన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు అనారోగ్య సమస్యలను ఎలా ముందుగా గుర్తిస్తుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
సమస్య పెరిగే ముందు..
పరిశోధనల ప్రకారం.. జుట్టు రాలడం, పలచబడటం లేదా రంగు మారడం వంటి మార్పులు అనేక ఆరోగ్య సమస్యలకు(Health Problems) తొలి సంకేతాలు కావచ్చని తెలుస్తుంది. జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే.. అది శరీరంలో ఐరన్, జింక్ లేదా ప్రొటీన్ లోపానికి సూచన కావచ్చు. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు, పీసీఓడీ, హార్మోన్ల మార్పుల వల్ల కూడా జుట్టు రాలడం సాధారణం. రోజుకు 50-100 వెంట్రుకలు రాలడం సహజం. కానీ అంతకంటే ఎక్కువగా రాలితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. దీని నివారణకు ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, పప్పులు, నట్స్ చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో యువతలో కూడా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం సాధారణమైపోయింది. విటమిన్ B12 లోపం, దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెలనిన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది. ఈ సమస్యను నివారించడానికి పాలు, పెరుగు, జున్ను, చేపలు, గుడ్లు వంటివి ఆహారంలో తీసుకోవాలి. అలాగే యోగా, ధ్యానంతో ఒత్తిడి తగ్గించుకోవాలి.
ఇది కూడా చదవండి: మంచి నిద్ర కావాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.!!
జుట్టు పల్చగా, నిస్తేజంగా మారితే అది థైరాయిడ్ సమస్యలకు(Thyroid Problems) సూచన కావచ్చు. ముఖ్యంగా హైపోథైరాయిడిజంలో జుట్టు పెరుగుదల మందగిస్తుంది. దీనికి పరిష్కారంగా బ్లడ్ టెస్ట్ ద్వారా థైరాయిడ్ స్థాయిలను పరీక్షించుకోవాలి. జుట్టులో అధికంగా చుండ్రు, దురద ఉంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా పొడి చర్మం సమస్యకు సూచన. ఎక్కువ కాలం చుండ్రు ఉంటే సోరియాసిస్ వంటి సమస్యలకు దారి తీయవచ్చు. యాంటీ-డాండ్రఫ్ షాంపూ ఉపయోగించడం, డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడంతోపాటు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఎక్కువ కెమికల్స్ వాడకుండా ఉండాలి. అంతేకాకుండా ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవడం అవసరం. జుట్టులో వచ్చే మార్పులను తేలిగ్గా తీసుకోవద్దని.. అవి పెద్ద ఆరోగ్య సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చని నిపుణులు సూచించారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నిద్రలో నోరు తెరిచి ఉంటే జాగ్రత్త.. ఈ అలవాటు ఆనారోగ్య సమస్యలకు సంకేతం
best-health-tips | latest health tips | health tips in telugu | latest-telugu-news | healthy life style | daily-life-style | human-life-style