/rtv/media/media_files/2025/08/09/tea-coffee-vs-sleep-2025-08-09-20-52-05.jpg)
Tea-Coffee Vs Sleep
Tea-Coffee Vs Sleep: నేటి కాలంలో ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర చాలా అవసరం. మంచి నిద్ర మన శరీరం, మెదడును రిఫ్రెష్ చేస్తుంది. నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతిరోజూ 7-8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే చాలామంది టీ లేదా కాఫీ తాగడం వల్లే నిద్ర పట్టదని అనుకుంటారు. కానీ రాత్రిపూట మనం తినే కొన్ని ఆహారాలు కూడా దీనికి ప్రధాన కారణం కావచ్చు. నిద్ర లేమిని దూరం చేయాలంటే రాత్రి భోజనంలో కొన్నింటిని తగ్గించాలి. రాత్రిపూట చాలాసేపు అటూఇటూ తిరుగుతూ ఉంటే.. డిన్నర్ ప్లాట్‌లో ఉన్న ఈ ఫుడ్స్‌పై ఒకసారి దృష్టి పెట్టండి. వైద్యులు అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహార పదార్థాలు నిద్రకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు. ఆ ఆహారాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మంచి నిద్ర కోసం..
రాత్రిపూట మసాలా, నూనెతో చేసిన పదార్థాలను తినడం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల ఎసిడిటీ, ఛాతీలో మంట వచ్చి నిద్రకు ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా మసాలాలు ఎక్కువగా ఉన్న కూరలు, వేయించినవి, ఎక్కువ మిరపకాయలు వాడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, ఆ తర్వాత వెంటనే పడిపోతాయి. ఈ హెచ్చుతగ్గులు నిద్ర యొక్క సహజ చక్రాన్ని భంగపరుస్తాయి. దీనివల్ల శరీరంలో అసౌకర్యం, ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ వస్తాయి. చాక్లెట్లలో కెఫిన్ మరియు థియోబ్రోమైన్ ఉంటాయి. ఇవి మెదడును ఉత్తేజపరుస్తాయి. అలాగే ఎనర్జీ డ్రింక్స్, కోల్డ్ డ్రింక్స్, టీ, కాఫీలలో ఉండే కెఫిన్ మరియు చక్కెర నిద్రను పాడు చేస్తాయి.
ఇది కూడా చదవండి: ఆరోగ్యకరమైన చిరుతిండిలో ఆనారోగ్య ప్రమాదాలు.. ఈ రోగులు దూరంగా ఉంటే బెస్ట్..!!
చికెన్, రెడ్ మీట్, ఎక్కువ జున్ను వంటి అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలు రాత్రిపూట జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణవ్యవస్థ చురుకుగా ఉండడం వల్ల శరీరం విశ్రాంతి తీసుకోలేదు, తద్వారా నిద్ర పట్టడానికి ఆలస్యం అవుతుంది. చాలామంది ఆల్కహాల్ తాగితే నిద్ర వస్తుందని నమ్ముతారు. కానీ ఇది గాఢ నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తుంది. మంచి నిద్ర కోసం తేలికపాటి, సమతుల్య ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. భోజనం, నిద్రకు మధ్య కనీసం 2 గంటల సమయం ఉండాలి. మసాలాలు, చక్కెర, కెఫిన్ ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. మంచి నిద్ర కేవలం బెడ్, గది వాతావరణం మీదనే కాకుండా.. మీరు తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. రాత్రి భోజనంలో ఈ ఆహారాలను తగ్గిస్తే.. ఉదయం తాజాగా లేచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: శరీరంలో వచ్చే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు..!!