Grapes: రోజూ ద్రాక్ష పండ్లు తింటే ఎండలో తిరిగినా ఏమీ కాదా?

ఎండలో తిరిగే వారు ఆహారంలో ద్రాక్షను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్‌ చర్మాన్ని ఎండ కిరణాల ప్రభావం నుంచి రక్షిస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని, పొడి బారిన, దెబ్బతిన్న చర్మాన్ని పునరుద్ధరించడంలోనూ సహాయపడుతుంది.

New Update

Grapes: ఏ రుతువులో అయినా ఎక్కువసేపు ఎండలో తిరిగితే చర్మానికి ముప్పు తప్పదు. కొందరికి చర్మం కందిపోవడం, ఎర్రబడటం, దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎండ వేడికి ఎక్కువసేపు నేరుగా గురైతే చర్మం నల్లబడుతుంది, పొడి బారుతుంది. దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే చర్మానికి తీవ్రమైన సమస్యలు, ఇన్‌ఫ్లమేషన్, మెలానిన్ పెరగడం, చివరికి చర్మ క్యాన్సర్‌ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలను నివారించేందుకు రసాయనాల మీద ఆధారపడకుండా ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలను ఉపయోగించవచ్చు.

ద్రాక్ష అద్భుతమైన పరిష్కారం..

అందులో ద్రాక్ష ఒక అద్భుతమైన పరిష్కారం. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో శాస్త్రవేత్తలు ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్‌ చర్మాన్ని ఎండ కిరణాల ప్రభావం నుంచి రక్షిస్తాయని తేలింది. కొంత మందికి ప్రతిరోజూ రెండు కప్పుల ద్రాక్ష తినమని సూచించారు. ఆ వ్యక్తులు తరువాత ఎండలో తిరిగారు. వారి చర్మాన్ని పరిశీలించగా ద్రాక్ష తినని వారి కంటే వీరి చర్మం ఆరోగ్యంగా ఉండి, ఎర్రదనం, ముడతలు వంటి ప్రభావాలు తక్కువగా ఉన్నాయని తేలింది. అయితే ద్రాక్ష తిన్న వెంటనే ఫలితం వస్తుందనే భ్రమలో ఉండకూడదు. 

ఇది కూడా చదవండి: కొవ్వును కరిగించే చింతకాయలు..ఇంకా బోలెడు లాభాలు

ద్రాక్ష తినడం వల్ల ప్రయోజనం పొందాలంటే ఎండలో తిరిగే 24 గంటల ముందు వాటిని తీసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు ఎండలో తిరిగే వారు దినసరి ఆహారంలో ద్రాక్షను భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి రసాయన సన్‌స్క్రీన్ల బదులు సహజంగా చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షించుకోవాలంటే ద్రాక్షను ఆహారంలో చేర్చడం చాలా ఉపయోగకరం. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా పొడి బారిన, దెబ్బతిన్న చర్మాన్ని పునరుద్ధరించడంలోనూ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: బట్టతలతో బాధపడుతున్నారా..ఇలా చేశారంటే నెలలో జుట్టు ఖాయం

grapes | black-grapes | grapes-benefits | grapes health benefits | health-tips | health tips in telugu | best-health-tips | latest health tips | latest-news | telugu-news)

Advertisment
తాజా కథనాలు