Tamarind: కొవ్వును కరిగించే చింతకాయలు..ఇంకా బోలెడు లాభాలు

చింతపండులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. చింతకాయలు జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు ఉంటే రాత్రి పూట చింతకాయ తీసుకుంటే మంచిది. అధిక బరువు ఉన్నవారు చింతకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు.

New Update
Tamarind

Tamarind

Tamarind: చింతకాయలు లేదా చింతపండు అనేవి భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని పచ్చిగా లేదా పండినప్పుడు కూడా వంటల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. చింతకాయ పులుసు, చింతకాయ పచ్చడి వంటి రుచికరమైన వంటకాలు చేస్తారు. అయితే ఈ చింతకాయలు కేవలం రుచికి మాత్రమే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అవి ఔషధ గుణాలు కలిగిన అద్భుతమైన పండ్లు. చింతకాయలు జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్న వారు.. ముఖ్యంగా మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు ఉన్న వారు రాత్రి పూట చింతకాయ తీసుకుంటే మరుసటి రోజు సుఖంగా విరేచనం అవుతుంది.

క్యాన్సర్లను నివారించడంలో..

ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజ పరచి జీర్ణాశయంలోని అల్సర్లను తగ్గిస్తుంది. పేగుల్లో వాపులు, ఇర్రిటేషన్ కూడా తగ్గిపోతుంది. అలాగే చింతకాయల్లో హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు నిల్వ కాకుండా చూసుకుంటుంది. అదేవిధంగా శరీరంలో కొవ్వు కరిగిపోవడం వల్ల అధిక బరువు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి అధిక బరువు ఉన్నవారు చింతకాయలను తమ ఆహారంలో భాగం చేసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు. చింతకాయలో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ C శరీరంలో హానికారక ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించి వాటి వల్ల ఏర్పడే క్యాన్సర్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇది కూడా చదవండి: నర్సులతో ఆపరేషన్‌.. కవల శిశువుల మృతి.. రంగారెడ్డిలో విషాదం

చింతకాయలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పేగుల్లో పురుగులు ఉండటం వంటి సమస్యలు అధికంగా ఉన్నవారు చింతపండును ఆహారంలో భాగం చేసుకుంటే వాటిని తగ్గించుకోవచ్చు. చింతపండులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లను, సూక్ష్మక్రిములను చంపడంలో సహాయపడతాయి. చిన్నారుల్లో ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి వారికి చింతపండును ఇవ్వడం ఉత్తమమైన పరిష్కారం. చింతకాయలు నాడుల పనితీరు మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. చింతపండులో ఉండే B విటమిన్ థయామిన్ నాడులు, కండరాల సరైన పనితీరుకు బాగా పనిచేస్తాయి. చింతపండులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలోని హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మొల‌కెత్తిన వెల్లుల్లి తింటే ఏమవుతుంది?

tamarind-leaves | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )

Advertisment
Advertisment
తాజా కథనాలు