Bald: బట్టతలతో బాధపడుతున్నారా..ఇలా చేశారంటే నెలలో జుట్టు ఖాయం

ఉల్లిపాయలు రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో ఉపయోగపడతాయి. ఉల్లిపాయ రసాన్ని తల చర్మంపై మృదువుగా మసాజ్‌ చేయాలి. ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదల, జుట్టు వృద్ధి వేగంగా జరుగుతుంది. తలలో దద్దుర్లు తగ్గుతాయి, వెంట్రుకలు దృఢంగా మారతాయి.

New Update

Bald: ఉల్లిపాయలకు వంటకాలలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఉల్లిపాయలలో ఉండే కొన్ని ముఖ్యమైన పోషకాలు మన జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా బట్ట తల సమస్యతో బాధపడేవారికి ఇది సహజమైన, సరళమైన పరిష్కారం. ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలలో కీలకమైన కెరాటిన్ అనే ప్రోటీన్ శక్తివంతంగా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టు వృద్ధి వేగంగా జరుగుతుంది. తలలో దద్దుర్లు తగ్గుతాయి, వెంట్రుకలు దృఢంగా మారతాయి.

ఉల్లిపాయ రసం తలకి వాడటం..

ఉల్లిపాయ రసం తలపై నేరుగా అప్లై చేయడం వల్ల ఫలితం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చేయడం చాలా సులభం. రెండు ఉల్లిపాయలు తీసుకుని మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని తల చర్మంపై మృదువుగా మసాజ్‌ చేయాలి. కనీసం రెండు గంటలపాటు అలాగే ఉంచిన తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. లేదా రాత్రిపూట రాసి మళ్లీ ఉదయం స్నానం చేయవచ్చు. ఈ ప్రక్రియను 30 రోజుల పాటు నిరంతరాయంగా చేస్తే మంచి మార్పులు కనిపిస్తాయి. జుట్టు రాలిపోవడం తగ్గి కొత్త వెంట్రుకలు రావడం ప్రారంభమవుతుంది. ఇంకా ఉల్లిపాయ రసం తలకి వాడటం వల్ల బ్లడ్‌ సర్క్యులేషన్‌ మెరుగవుతుంది.

ఇది కూడా చదవండి: థైరాయిడ్ ఉంటే కాలిఫ్లవర్‌, క్యాబేజీ తినవచ్చా?

దాంతో తల చర్మానికి ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందుతాయి. ఇది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. చాలామంది ఈ విధానాన్ని ఫాలో అవుతూ మంచి ఫలితాలు పొందుతున్నట్లు చెబుతున్నారు. మార్కెట్లో ఉల్లిపాయ శాంపూలు, ఆయిల్స్‌ లభిస్తున్నా వాటిలో కెమికల్స్‌ ఉండే అవకాశం ఉంది. అందుకే సహజంగా ఇంట్లో తయారుచేసుకున్న ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం మేలు చేస్తుంది. శస్త్రచికిత్సలు లేకుండా, ఖర్చులు పెట్టకుండా ఇంట్లోనే ఈ విధానం ద్వారా బట్టతల సమస్యను అధిగమించవచ్చు. సహజమైన చికిత్స కావడం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా నెమ్మదిగా మంచి ఫలితం వస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అన్నం తినడం మానేసినా షుగర్‌ లెవల్స్‌ తగ్గడం లేదా ఇలా చేయండి


( bald-head | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )

Advertisment
తాజా కథనాలు