/rtv/media/media_files/2025/05/02/xGIrn3uz08danbFbqEIa.jpg)
Fruits
Fruits: 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత శరీరంలో అనేక హార్మోనల్, శారీరక మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా చర్మం తన సహజ యవ్వనాన్ని కోల్పోతుంది. ముడతలు కనిపించడం ప్రారంభమవుతాయి. ఈ మార్పులకు ప్రధాన కారణం శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోవడమే. కొల్లాజెన్ అనేది చర్మానికి బలాన్ని, బిగుతును ఇవ్వడానికి అవసరమైన ముఖ్యమైన ప్రొటీన్. వయస్సుతో పాటు ఇది తక్కువ అవుతుంటుంది. దీంతో చర్మం వృద్ధాప్య లక్షణాలను చూపించడం ప్రారంభిస్తుంది. అయితే సరైన ఆహారం ద్వారా ఈ మార్పులను కొంత మేరకు నియంత్రించవచ్చు.
చర్మ కణాలను దెబ్బతినకుండా..
ముఖ్యంగా కొల్లాజెన్‌ను పెంచే కొన్ని పండ్లను ఆహారంలో చేర్చడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచవచ్చు. వయస్సుతో వచ్చే చర్మ సమస్యలకు నారింజ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ సి, కొల్లాజెన్ తయారీకి ముఖ్యమైన పోషక పదార్థం. ప్రతిరోజూ ఒక నారింజ తినడం వల్ల చర్మం బిగుతుగా, ప్రకాశవంతంగా ఉండటమే కాకుండా ముడతలు తగ్గిపోతాయి. జామపండు కూడా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో శరీరాన్ని లోపలి నుంచి బలంగా చేస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పండు. ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవచ్చు. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్ వంటి పండ్లు యాంటీ ఏజింగ్ లక్షణాలతో ప్రసిద్ధి చెందాయి. ఇవి చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే కొల్లాజెన్‌ను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి.
ఇది కూడా చదవండి: మానస సరోవరం యాత్రపై చైనా కీలక అప్‌డేట్
అలాగే బొప్పాయి ముడతలకు శత్రువుగా పని చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఈ సమృద్ధిగా ఉండటంతో చర్మ మరమ్మత్తుకు ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఉదయం కొద్దిగా బొప్పాయి తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కివీ పండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటంతో కొల్లాజెన్ ఉత్పత్తి మెరుగవుతుంది. ఇవి శరీరాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచి, బయటకూడా చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ పండ్లతో పాటు రోజూ తగినంత నీరు తాగడం ద్వారా చర్మం హైడ్రేటెడ్‌గా ఉండి, కొల్లాజెన్ బాగా పనిచేస్తుంది. దీంతో వయస్సుతో వచ్చే చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: బాగా లావు ఉంటే మెదడు పని చేయదా..?
( skin | beautiful-skin | best-skin-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )