Health Tips: రోజూ మనకు తెలియకుండానే ఈ విషాహారం తీసుకుంటున్నాం

రోజూ తినే ఆహారాల్లో అనారోగ్యకరమైనవి ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో మైదా, నూడుల్స్‌, బిస్కెట్లు, ప్యాకెజ్‌డ్ పిండివంటలు, వేపుళ్లకు వాడిన నూనె శరీరానికి హానికరం. ఇవి గుండె సంబంధిత, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Health Tips food

Health Tips food

Health Tips: నిత్యం మనం అనేక రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. వాటిలో కొన్నిటి వల్ల మన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. కానీ చాలా మందికి తెలియకుండానే ప్రతి రోజూ తినే ఆహారాల్లో అనారోగ్య కరమైనవి ఎక్కువగా ఉంటాయి. ఇవి తొలుత అంతగా ప్రభావం చూపకపోయినా కాలక్రమేణా శరీరంపై తీవ్ర ప్రభావాలు చూపుతాయి. దీర్ఘకాలికంగా ఇవి తీసుకుంటూ పోతే డయాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులు, కొవ్వు పెరగడం, హార్మోన్ల అసమతుల్యత, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం ప్రతి రోజు తీసుకునే ఆహార పదార్థాలపై కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

గుండె సంబంధిత వ్యాధులకు..

అనారోగ్యకర ఆహారాల్లో మైదా ఒకటి. ఇది సాధారణంగా నూడుల్స్‌, బిస్కెట్లు, ప్యాకెజ్‌డ్ పిండివంటల తయారీలో వాడతారు. కానీ మైదా శరీరానికి పోషణ ఇవ్వదు. దీనిలో ఫైబర్‌ లేకపోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. మరో వైపు వేపుళ్లకు వాడిన నూనె కూడా శరీరానికి చాలా హానికరం. చాలా సార్లు వేడి చేసి వాడే నూనెలో టాక్సిన్లు, ట్రాన్స్‌ ఫ్యాట్లు ఏర్పడి శరీరాన్ని విషపూరితంగా మారుస్తాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. కార్న్ స్టార్చ్‌ను పలు వంటకాల్లో క్రిస్పీగా ఉండేందుకు వాడతారు. ఇది శరీరానికి వేగంగా శక్తినిస్తుందనిపించినా ఇందులో పోషక విలువలు ఉండవు. 

ఇది కూడా చదవండి: చికెన్ తింటే నిజంగానే క్యాన్సర్‌ వస్తుందా..నిపుణులు ఏమంటున్నారు?

దీనివల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి ఎక్కువవుతుంది. అదే విధంగా చక్కెరను అధికంగా తీసుకోవడం డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఇది కేవలం శరీరంలో శక్తిని ఇస్తుందే కానీ ఇతర పోషకాలేమీ అందించదు. ఉప్పు కూడా తగిన పరిమాణంలోనే వాడాలి. ఎక్కువ ఉప్పు వల్ల బీపీ, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇంకొక హానికరమైన పదార్థం టేస్టింగ్ సాల్ట్‌. దీన్ని వాడటం వలన వంటకానికి రుచి పెరిగినట్లు అనిపించినా దీర్ఘకాలికంగా ఇది నరాలు, మెదడు, హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బయట తినే ఆహార పదార్థాల్లో దీనిని అధికంగా వాడుతారు. కాబట్టి వీలైనంత వరకూ బయట ఆహారాలను తగ్గించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Also read :  India vs Pakistan : భారత్‌ను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా.. పాక్‌ మరోసారి క్షిపణి ప్రయోగం?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వ్యాయామంతో ముఖంలో కాంతి పెరుగుతుందా?

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | food )

Advertisment
తాజా కథనాలు