/rtv/media/media_files/2025/05/05/4Iq3sd9Ktcg9m0AJNPj4.jpg)
Pakistan launches missile again
India vs Pakistan :జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని విషయం అందరికీ తెలిసిందే. పుల్వామా దాడి అనంతరం భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయగా.. మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి దాడులే ఎక్కడ చేస్తుందోనని భయపడుతున్న పాక్.. అప్రమత్తం అయింది. తీరం వెంబడి సైనికులను పెంచి.. యుద్ధానికి సిద్ధం అంటోంది. ఈక్రమంలోనే ఇటీవల భూతలం నుంచి భూతలం పైకి 450 కిలో మీటర్ల రేంజ్ అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పేర్కొన్న ఇస్లామాబాద్ తాజాగా మరోసారి క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించింది. అది ఎప్పుడు ఎక్కడ ప్రయోగించిందనే విషయాలు వెల్లడించనప్పటికీ మరోసారి క్షిపణి ప్రయోగించినట్లు ఇస్లామాబాద్ వర్గాలు స్పష్టం చేశాయి.
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
ఇప్పటికే పాకిస్థాన్ శనివారం అబ్దాలి వెపన్ సిస్టమ్ క్షిపణి శిక్షణ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపింది. ఎక్స్ ఇండస్ కసరత్తుల్లో భాగంగా తయారు చేసిన 450 కి.మీ పరిధి గల ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి ఇది. దళాల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడం, క్షిపణి అధునాతన నావిగేషన్ వ్యవస్థ, మెరుగైన యుక్తి లక్షణాలతో సహా కీలకమైన సాంకేతిక పారామితులను ధ్రువీకరించడం ఈ ప్రయోగం లక్ష్యం అని తెలిపింది. ఈ క్షిపణి శిక్షణ ప్రయోగాన్ని ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కమాండర్‌తో పాటు స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలుతిలకించినట్టు పీటీవీ సహా పలు వార్తా సంస్థలు తెలిపాయి.
Also Read : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్
ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్‌క్లూజివ్ జోన్‌లో భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్థాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం ఏప్రిల్ 26-,27 మధ్య మరోసారి అలాంటి ప్రకటనే చేసిందని.. తాజాగా ఏప్రిల్ 30- మే 2 మధ్య మరోసారి పరీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాక్ తరచూ ఇటువంటి ప్రకటనలు చేస్తూ.. భారత్‌ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని భారత రక్షణశాఖ అధికారులు మండిపడ్డారు.
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
పహల్గాం దాడి తర్వాత గత తొమ్మిది రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా కాల్పులు జరుపుతోంది. ఉగ్రదాడి అనంతరం భారత్ తమపై ప్రతీకార దాడి చేసే అవకాశం ఉందని పాక్ మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం తమ సరిహద్దులో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని బాడ్‌మెర్‌లోని లాంగేవాలా సెక్టార్‌కు అటువైపు ఉన్న ప్రాంతంలో రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పాక్ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!