Exercise
Exercise: వ్యాయామం చేయడం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యమైన అంశం. చాలామంది వ్యాయామాన్ని బరువు తగ్గడం లేదా శరీరాకృతి మెరుగుపరచడానికే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ నిజానికి ఇది చర్మానికి ప్రకాశం తీసుకువచ్చే ఒక సహజ మార్గం. వ్యాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ముఖానికి రక్త సరఫరా మెరుగవడం వల్ల అక్కడి చర్మ కణాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు సమృద్ధిగా అందుతాయి. దీని వలన చర్మ కణాల పునరుత్పత్తి వేగంగా జరుగుతుంది. పాత, మృత కణాలు తొలగిపోతూ కొత్త, ఆరోగ్యకరమైన కణాలు వృద్ధి చెందడంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చెమట ద్వారా శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
చర్మం చక్కగా మెరిచేలా..
ఇవి చర్మ కణాలలో చేరకుండా తొలగిపోవడం వల్ల మొటిమలు, అలర్జీలు వంటి సమస్యలు తక్కువగా కనిపిస్తాయి. ఈ ప్రక్రియను డిటాక్సిఫికేషన్ అని పిలుస్తారు. అంతేకాకుండా వ్యాయామం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. అధిక కార్టిసోల్ స్థాయిలు చర్మం పొడిబారడం, మొటిమలు రావడం వంటి సమస్యలకు దారితీస్తాయి. వ్యాయామం చేసి ఒత్తిడిని నియంత్రిస్తే ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. శ్వాస వ్యాయామాలు కూడా చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖానికి మరింత రక్తం వెళ్లేలా చేయాలంటే శీర్షాసనం వంటి యోగా ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. మొదట అది కష్టంగా అనిపించినా ప్రాక్టీస్ చేస్తే సాధ్యమే.
ఇది కూడా చదవండి: హైబీపీ ఉన్నవారు కోడిగుడ్లు తింటే ఏమవుతుంది?
ఒకవేళ ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు నడక, జాగింగ్, వ్యాయామం లేదా యోగా చేస్తే కొన్ని వారాలలోనే ముఖం ప్రకాశవంతంగా మారడం గమనించవచ్చు. అలాగే రోజూ తగినంత నీటిని తాగడం కూడా తప్పనిసరి. నీరు తగినంతగా తాగకపోతే చర్మం పొడిబారుతుంది. అలాంటి సందర్భాల్లో ఎంత మంచి వ్యాయామం చేసినా శరీరం లోపల తేమ లేకపోతే ఫలితం పూర్తిగా కనిపించదు వ్యాయామం చేయడం చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాదు సమగ్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ప్రతి రోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. దీంతో ఎంతో ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపిస్తారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్!
( benefits-of-exercise | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )