Chicken and cancer
Chicken: చికెన్‌ను అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటూ కొందరు చెబుతున్నారు. మీరు వెజిటేరియన్ అయినా నాన్-వెజిటేరియన్ అయినా ఆహారం పోషకాలు కలిగి ఉండటం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఇటలీలో జరిగిన తాజా పరిశోధన ప్రకారం వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారికి జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా పేగు క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశముంది. గతంలో రెడ్ మీట్ కంటే చికెన్‌ను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా భావించేవారు. కానీ ఈ అధ్యయనం తర్వాత ఆందోళన నెలకొంది. ఈ పరిశోధనలో 4,800 మందికి పైగా వ్యక్తుల ఆహార అలవాట్లను విశ్లేషించారు.
నాన్ వెజ్ తినేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఎక్కువ చికెన్ తీసుకునేవారిలో అకాల మరణ రేటు అధికంగా కనిపించిందని గుర్తించారు. అయితే ఈ ప్రమాదం చికెన్ వండే పద్ధతిలో ఉందా లేదా చికెన్ పుష్కలంగా ఉండే కొలెస్ట్రాల్ లేదా ప్రాసెసింగ్ విధానంలో ఉందా అన్నది ఇంకా స్పష్టంగా తేలలేదు. దీనికి మరింత లోతైన అధ్యయనం అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి. మొదటగా చికెన్‌ను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. వారం రోజుల్లో రెండుసార్లు చిన్న పరిమాణంలో తీసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: 40 ఏళ్ల వయస్సు తర్వాత కచ్చితంగా ఈ పండ్లను తినాలి
అలాగే దాన్ని డీప్ ఫ్రై చేయడం కాకుండా సాదాగా ఉడికించడం లేదా ఆవిరి పద్ధతిలో వండటం మంచిది. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి ఫైబర్ కలిగి ఉండి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా ప్రాసెస్ చేసిన మాంసాలు, సోసేజ్‌లు, నగ్గెట్స్ వంటి వాడకాన్ని తగ్గించడం అవసరం. ఈవిధంగా తీసుకునే జాగ్రత్తల ద్వారా మాంసాహారం తీసుకునే వారు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఏ ఆహార పదార్థమైనా అధికంగా తీసుకోవడం హానికరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నిద్రపోయే ముందు ఇది పాలల్లో కలిపి తాగితే కొలెస్ట్రాల్ మాయం
( cancer | latest-news | best-health-tips | latest health tips | health tips in telugu | health-tips)