Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగవచ్చా?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీనిలోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు.

New Update
Remedy with lemon juice

lemon juice

చాలా మందికి ఉదయం పూట ఖాళీ కడుపుతో నిమ్మరసం నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. నిమ్మరసం నీళ్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఈ నీళ్లలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

ఆరోగ్యంగా ఉంటారు..

నిమ్మకాయలలో ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. వీటికి యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే నిమ్మరసంలోని విటమిన్‌ సి, శక్తివంతమైనన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో కణాలకు నష్టం చేసే ఫ్రీ రాడికల్స్‌తో యాంటీ ఆక్సిడెంట్లు పోరాడతాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తాయి. ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగితే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్‌ తొలగుతాయి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. నిమ్మకాయలు, ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీర కణాలను రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటితో పాటు విటమిన్ సి మీ శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి, ఐరన్‌ శోషణ, కొల్లాజెన్ సంశ్లేషణలో ఉపయోగపడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

ఇది కూడా చూడండి: IPL 2025: ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విక్టరీ..

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

 

health-benefits | juice | early-morning | lemon | latest-telugu-news | today-news-in-telugu | health tips in telugu | best-health-tips | healthy life style | daily-life-style | human-life-style

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు